చిన్నప్పుడు నుంచి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతుర్ని ఇటీవలే ఒక అయ్య చేతిలో పెట్టింది ఆ తల్లి. దీంతో కూతురికి పెళ్లి చేశాను అన్న ఆనందంలో ఉంది. అయితే ఆషాడ మాసం కావడంతో ఇక ఇటీవలే కూతుర్ని ఇంటికి పిలిపించుకుంది. పుట్టింటికి వచ్చిన సదరు యువతి తల్లి తో ముచ్చట్లు చెప్పుకుంటూ ఎంతో ఆనందంగా గడిపింది. చివరికి అన్నం తిని హాయిగా నిద్ర పోయారు. కానీ ఆ రాత్రే వారికి చివరి రాత్రి గా మారిపోయింది. ఆ రోజు రాత్రి కురిసిన జోరువాన చివరికి తల్లీకూతుళ్ల ప్రాణం తీసింది. వర్షం కారణంగా మట్టిగూడ తడిసి చివరికి ఇల్లు కూలిపోయింది.


 చివరికి ఇక గోడ కింద కూరుకు పోయిన తల్లి బిడ్డ కన్నుమూశారూ. ఈ విషాదకర ఘటన నల్గొండ పట్టణంలోని పద్మ నగర్ లో వెలుగులోకి వచ్చింది. మృతులు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం మాకివలస గ్రామానికి చెందిన లక్ష్మి, కళ్యాణి గా గుర్తించారు.. మాకి వలసకు చెందిన లక్ష్మి భర్త నాయుడు ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోవడంతో పిల్లలు భాస్కరరావు, కళ్యాణి తో కలిసి నల్గొండ లోని పద్మ నగర్ కు వచ్చింది. మూడేళ్లుగా రైల్వే కూలీగా పని చేస్తూ ఇక కుటుంబపోషణ చూసుకుంటుంది.


 ఈ క్రమంలోనే ఎంతో కష్టపడి ఇటీవలే కూతురు వివాహం జరిపించిం. ది శ్రీకాకుళం జిల్లా ధరూర్ మండలం కి చెందిన బంధువులు అబ్బాయి శ్రీను తో కళ్యాణి వివాహం జరిగింది. అయితే ఇటీవలే ఆషాఢ మాసం కావడంతో కల్యాణి వారం క్రితమే పుట్టింటికి వచ్చింది. ఇక ఇటీవలే తల్లితో కలిసి ఎంతో ఆనందంగా ముచ్చట్లు చెప్పి ఇక రాత్రి తిని పడుకున్నారు. కాని ఆ రాత్రి వారికి చివరి రాత్రి గా మారిపోయింది. మట్టి గోడకూలి వారిపై పడింది. దీంతో ప్రాణాలు వదిలారు. అయితే ఇంట్లో కుమారుడు లేకపోవడంతో బయటపడ్డాడని. లేదంటే అతని ప్రాణాలు కూడా పోయేది అంటూ చెబుతున్నారు స్థానికులు. కాగా మృతదేహాలను  అంత్యక్రియల కోసం స్వగ్రామానికి తీసుకువెళ్లారు.

మరింత సమాచారం తెలుసుకోండి: