ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వాడకం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే  సోషల్ మీడియాను కేవలం మంచి పనుల కోసం ఉపయోగించడం కాదు.. ఎంతో మంది కేటుగాళ్లు అమాయకులను బురిడీ కొట్టించడానికి కూడా ఆయుధంగా వాడుతున్నారు. ఇలా ఎంతోమంది ఇప్పటివరకు సోషల్ మీడియా వేదికగా ట్రాప్ చేయబడి మోసపోయిన వారు ఉన్నారు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఇటీవలి కాలంలో ఎంతోమంది అందమైన యువతులు యువకులకు ఫోన్ చేయడం.. తీయగా మాట్లాడటం.. చివరికి పరిచయం పెంచుకుని తమకు కావాల్సిన అన్ని సమాచారం దొరికిన తర్వాత అప్పుడు అసలు స్వరూపం బయటపెట్టడం చేస్తున్నారు.


 చివరికి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజడం లాంటి వి కూడా చేస్తున్నారు.  యువతి వలలో పడిన వ్యక్తి నుండి డబ్బులు పోగొట్టుకొని ఇబ్బందుల్లో పడిపోయాడు. బెంగళూరు వేదికగా ఈ ఘటన జరిగింది అన్నది తెలుస్తుంది. ఉద్యాన నగరిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుని కి  యువతితో వాట్సాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. అయితే యువతి ఎంతో దగ్గరి మనిషిలా మాట్లాడటంతో ఇక వీరిద్దరి మధ్య చనువు కూడా పెరిగిపోయింది. ఎంతలా అంటే ఏకంగా వాట్సాప్ లో ఒకరికి ఒకరు నగ్నంగా వీడియో కాల్ చేసుకునేంతలా.


 యువతి అడగడంతో నగ్నంగా వీడియో కాల్ చేశాడు సదరు యువకుడు. దీంతో ఇదంతా రికార్డ్ చేసిన యువతి ఆ తర్వాత బ్లాక్మెయిల్ కు పాల్పడింది. ఈ క్రమంలోనే ఎన్నోసార్లు డబ్బు ఇచ్చిన బాధితుడు తర్వాత నావల్ల కాదు అంటూ చేతులెత్తేశాడు. ఇంతలో మరికొంత మంది దుండగులు అతనికి కాల్  చేసి.. నీతో వీడియో కాల్ మాట్లాడిన యువతి చనిపోయింది అంటూ బెదిరించడం  మొదలు పెట్టారు. ఇలా ఐదు లక్షలకు పైగా డబ్బులు వసూలు చేశారు. ఈ క్రమంలోనే ఇటీవల స్నేహితులతో కలిసి సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు బాధితుడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: