ఇటీవలి కాలంలో ప్రేమ అనేది ఎంతో మంది ప్రాణాలు తీస్తోంది. ఎంతో మంది తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తుంది. మంచి ఉద్యోగం సాధించి బాగా సంపాదిస్తున్న సమయంలో ప్రేమలో పడి  పెళ్లితో ఒక్కటవ్వటం కాదు ఇటీవలి కాలంలో చిన్న వయసులోనే ప్రేమ అంటూ పెడదోవ పడుతున్నారు విద్యార్థులు. అంతే కాదు కనీసం మైనార్టీ తీరకముందే ప్రేమలో మునిగి తేలుతూ తమ ప్రేమను గెలిపించుకోవడానికి ప్రాణ త్యాగం చేయడానికైనా సిద్ధపడుతున్నారు. తద్వారా పిల్లల పైన ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు ఎంతోమంది విద్యార్థులు.


 ఇటీవల కాలంలో ఇలాంటి తరహా సంఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది.  ప్రేమించిన అమ్మాయి చనిపోయింది అని తెలిసి ఆ యువకుడు తట్టుకోలేకపోయాడు. చివరికి ఆత్మహత్య చేసుకొని తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు. ఈ ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. కర్ణాటకకు చెందిన వెంకటేష్ మంగా దంపతులకు కుమార్తె, కుమారుడు శ్రీకాంత్ (19)ఉన్నారు. అయితే హైదరాబాద్ లోని నేరేడ్మెట్ లో వినాయక నగర్ లో ఉంటుంది ఈ కుటుంబం. శ్రీకాంత్ షాపింగ్ మాల్ లో పనిచేస్తూ కుటుంబ పోషణ చూసుకుంటున్నాడు.


 అతనికి కొంత కాలం క్రితం రాజేంద్ర నగర్ కు చెందిన 19 ఏళ్ల యువతిపై ఫేస్బుక్  లో పరిచయం ఏర్పడి.. పరిచయం ప్రేమగా మారింది. చివరికి యువతి పెళ్లి చేసుకోవాలని భావించి ప్రేమ విషయం ఇంట్లో చెప్పడంతో పెళ్లికి అంగీకరించలేదు. దీంతో పెద్దలను ఎదిరించి గుడిలో పెళ్లి చేసుకుంది ఈ జంట.  కొంతకాలం కలిసే ఉన్నారు. అయితే 21 ఏళ్లు నిండ కుండానే పెళ్లి చేసుకోవడం చట్ట విరుద్ధమంటూ యువతి కుటుంబ సభ్యులు శ్రీకాంత్ పై పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు యువతిని తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన యువతి ఆత్మహత్య చేసుకుంది. అయితే విషయం శ్రీకాంత్ కు తెలిసింది. అప్పటి నుంచి  ఇక తీవ్ర మనోవేదనకు గురైన  శ్రీకాంత్ చివరికి ఇటీవలే రైలు కింద  పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: