సాధారణంగా పెళ్లయిన తర్వాత ఎంతో మంది ఆడపిల్లలు కోటి ఆశలతో మెట్టినింట్లో అడుగు పెడుతూ ఉంటారు. కానీ అత్త మామల నుంచి భర్త నుంచి కొన్నాళ్లకే వేధింపులు ఎదురవడం లాంటి ఘటనలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా అదనపు కట్నం కోసం ఎంతోమంది అమ్మాయిలను కాల్చుకు తింటున్నారు మెట్టినింటివారు. అదే సమయంలో కొన్ని కొన్ని సార్లు అటు పెళ్లి చేసుకున్న యువతులు సైతం భర్త అత్తమామలను వేధించడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అందుకే ఇటీవల కాలంలో భార్యా బాధితుల సంఘాలు కూడా తెరమీదికి వస్తున్నాయి.


 ఇంకొంతమంది అయితే పెళ్లి చేసుకొని కట్టుకున్న బంధానికి కట్టుబడి ఉండకుండా పరాయి వ్యక్తుల మోజులో పడి వివాహేతర సంబంధాలకు తెర లేపుతూ  ఉంటారూ. అన్న విషయం తెలిసిందే ఇలా ఇటీవల కాలంలో అక్రమ సంబంధాల విషయాల్లో మగాళ్లు ఆడవాళ్లు అనే తేడా లేకుండా అందరూ రెచ్చిపోయి మరి పచ్చటి కాపురంలో చేజేతులారా చిచ్చు పెట్టుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయ్. ఇటీవల చత్తీస్గడ్ లోని దూర్గ్ జిల్లాలో కూడా ఇలాంటి తరహా ఘటన జరిగింది. అమరేశ్వర్ గ్రామంలో అనంత్ సోహవాని తన భార్య సంగీత తో కలిసి ఉంటున్నాడు.


 అయితే కొన్నాళ్లపాటు వీరికాపురం మూడు పువ్వులు ఆరు కాయలు అన్న విధంగానే జరిగింది. కానీ ఆ తర్వాత మాత్రం భార్యను సూటిపోటి మాటలతో వేధించడం మొదలుపెట్టాడు అనంత్. నువ్వు నల్లగా ఉన్నావ్ అంటూ వేధిస్తూ ఉండేవాడు. శరీరంపై మచ్చలు ఉన్నాయని అసభ్యంగా మాట్లాడుతూ అందరిలో పరువు తీసేవాడు. ఇదే విషయంపై భర్తతో గొడవ పడింది సదరూ మహిళ. చివరికి విచక్షణ కోల్పోయింది. గొడ్డలితో భర్త పై విచక్షణ రహితంగా దాడి చేసింది. భర్త పురుషాంగాన్ని కూడా కోసేసింది. తర్వాత ఏమి తెలియనట్లుగా పడుకుని ఉదయాన్నే భర్తను ఎవరో చంపేసారంటు. కొత్త నాటకానికి తెరలేపింది. అయితే భార్య తీరుపై అనుమానం వచ్చిన పోలీసులు విచారణ జరుపగా చివరికి అసలు విషయం వెలుగు చూసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: