సాధారణంగా పెళ్లి అంటే ఎంత సందడిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా బంధుమిత్రులందరి సమక్షంలో నూతన వధూవరులు ఇద్దరు కూడా కొత్త జీవితంలోకి అడుగుపెడుతూ ఉంటారు. ఇక అక్కడికి వచ్చిన బంధువులు అందరూ కూడా వధూవరులను ఆశీర్వదించి కలకాలం పిల్లాపాపలతో ఎంతో సంతోషంగా ఉండాలని దీవించడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా పెళ్లి అంటేనే మండపంలో ఉండే సందడి అంతా ఇంత కాదు. అయితే కొన్ని కొన్ని సార్లు పెళ్లి జరుగుతున్న సమయంలో ఊహించని ఘటనలు కూడా జరుగుతూ ఉంటాయి.


 ఇటీవల కాలంలో అయితే పెళ్లిళ్లలో మటన్ చికెన్ తక్కువగా వేశారు అన్న కారణంతో  పెళ్లిళ్లు కూడా ఆగిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. ఇక ఇంకొన్నిసార్లు ఏకంగా పెళ్లిళ్లలో అనుకోని అతిథులు కూడా ప్రత్యక్షమవుతూ ఉంటారు. ఎవరో తెలియని వారు సైతం పిలవని పేరంటాలకు వెళ్లి కడుపు నింపుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక కొన్ని కొన్ని సార్లు ఇలా పిలవని పేరంటాలకు వెళ్లిన వారికి చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా కడుపు నింపుకునేందుకు పిలవని పేరంటానికి వెళ్లిన సదరు వ్యక్తి ఊహించని శిక్షను అనుభవించాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్లో జరిగిన వివాహ వేడుకకు ఆహ్వానం లేకపోయినా ఒక వ్యక్తి ఏకంగా పెళ్లి వారికి దొరికిపోయాడు. ఎంబీఏ చదువుతున్న ఓ విద్యార్థి భోజనం చేసేందుకు వెళ్లగా.. ఇక పెళ్లి వారు అతని గుర్తించి మీకు ఆహ్వానం ఉందా అంటూ ప్రశ్నించారు.  అతను లేదు అని సమాధానం చెప్పడంతో ఏకంగా పెళ్లిలో ఉన్న అన్ని ప్లేట్ లను కూడా అతనితో కడిగించారు. ఈ ఘటన కాస్త సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ విషయం గురించి తెలిసి ఒక మనిషి పట్ల ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తారు అంటూ ఎంతో మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: