ఇటీవల కాలంలో ఎందుకో గాని ఏకంగా విద్యార్థులకు చదువు మీద సరైన ద్యాస ఉండడం లేదు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఒకప్పుడు బాగా చదువుకోవడానికి స్కూల్ కి డుమ్మ కొట్టకుండా వెళ్లేవారు. కానీ ఇప్పుడు మాత్రం స్కూల్ అంటేనే భయపడిపోతున్నారు. ఇక ఇటీవల కాలంలో పాఠశాలల్లో బట్టి పట్టి చదువులు ఉన్న నేపథ్యంలో విద్యార్థులకు సరైన చదువు సంధ్య అంటడం లేదు  అన్నది ప్రతి ఒక్కరు చెప్పే మాట.  అయితే ఇక ఒకవేళ విద్యార్థులు ఎవరైనా స్కూల్ కి గైర్హాజరు అయినప్పుడు ఉపాధ్యాయులు పట్టించుకోకుండానే ఉంటారు.


 విద్యార్థులు స్కూల్ కి హాజరు కాకపోతే ఏంటి మాకు నెలకు సాలరీ వస్తుంది కదా అంటూ భావిస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఉపాధ్యాయులు మాత్రం ఇలా ఎవరైనా విద్యార్థి స్కూల్ కి డుమ్మ కొట్టాడు అంటే.. ఏకంగా ఆ విద్యార్థి పేరెంట్స్ ని పిలిచి మరి కౌన్సిలింగ్  ఇవ్వడం అంటే చేస్తూ ఉంటారు..తద్వారా తల్లిదండ్రుల రికమండేషన్ తో ఇక విద్యార్థులు మళ్ళీ బడికి వచ్చేలా చేస్తూ ఉంటారు. ఇక్కడకు ఉపాధ్యాయుడు మాత్రం ఏకంగా పదవ తరగతి చదువుతున్న విద్యార్థికోసం ఒక అడుగు ముందుకు వేశాడు అని చెప్పాలి.


 పది రోజులుగా విద్యార్థి పాఠశాలకు రాకపోవడం  తో ఒక ఉపాధ్యాయుడు వెళ్లి ఏకంగా విద్యార్థి ఇంటి ముందు బైఠాయించాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా బెజ్జంకి జడ్పీ హైస్కూల్లో వెలుగు లోకి వచ్చింది జేరిపోతుల నవీన్ పదవ తరగతి చదువుతుండగా పది రోజులుగా పాఠశాలకు రావడం లేదు. గమనించిన ఇంగ్లీష్ టీచర్ ప్రవీణ్ విద్యార్థి ఇంటికి వెళ్లి పాఠశాలకు ఎందుకు పంపించడం లేదని తల్లిదండ్రులను అడిగాడు. ఇక వాళ్లు పొంతన లేని సమాధానం చెప్పడం తో అతన్ని పాఠశాలకు పంపించేంతవరకు ఇక ఇక్కడి నుంచి కదిలేది లేదు అంటూ ఏకంగా ధర్నా చేశాడు ఉపాధ్యాయుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: