ఎందుకంటే వారి వద్ద ఉండే పదునైన కత్తులతో ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒక వైద్యుడు కారణంగా మహిళలకు ఇలాంటి ప్రమాదం జరిగింది. వైద్యుడు నిర్లక్ష్యం కారణంగా చివరికి ఒక మహిళ పెదాలపై తీవ్రంగా గాయమైంది. చివరికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాల్సిన దుస్థితి కూడా ఏర్పడింది. ఈ ఘటన బెంగుళూరులో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. రామ్మూర్తి నగర్ లో నివసించే ఒక మహిళ జూన్లో స్థానికంగా ఉండే డెంటిస్ట్ వద్దకు వెళ్ళింది. పదునైన ఇన్స్ట్రుమెంట్స్ తో చికిత్స చేస్తుండగా ఆమె పై పెదవి మొత్తం కోసుకుపోయింది.
ఇక పెదవి నుంచి రక్తం చిమ్మడంతో ఒక్కసారిగా షాక్ అయింది సదరు మహిళ. ఈ క్రమంలోనే గాయం తీవ్రత ఎంత ఉందో తెలుసుకోవడానికి అద్దం కూడా అడిగింది. అయితే వైద్యుడు అద్దం ఇవ్వకపోగా గాయం తీవ్రత ఎక్కువగా లేదు అంటూ అబద్ధం చెప్పాడు. అంతే కాకుండా ఆమెని ఇంటికి పంపించి 5000 కూడా వసూలు చేశాడు. ఇంటికి వచ్చాక చివరికి ఆమెకు ఎంత గాయం అయిందో అర్థమైంది. ఇక్కడి నుంచి మరో వైద్యుడు దగ్గరికి వెళ్లగా ఏకంగా పెదవికీ 5 కుట్లు వేశారు. ఇక తర్వాత చూసుకుంటే పూర్తిగా ఆమె అంద విహీనంగా మారిపోయింది. దీంతో న్యాయం చేయాలంటూ కోర్టును ఆశ్రయించింది మహిళ. ఇక వినియోగదారుల ఫోరం కోర్టు ఏకంగా బాధితులు 60 వేలు రూపాయల పరిహారం చెల్లించేలా ఆదేశాలు జారీ చేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి