ఇటీవల కాలంలో ప్రతి మనిషి టెక్నాలజీకి బాగా అలవాటు పడిపోయాడు. అయితే ఈ క్రమంలోనే ప్రతి పని కూడా ఎంతో సులభతరంగా మారిపోయింది. అయితే మారిన కాలానికి అనుగుణంగానే అటు అక్షరాస్యత కూడా పెరిగిపోయింది. ఇక అందరిలో కూడా అవగాహన పెరిగిపోయిన నేపథ్యంలో తమ పిల్లలను తక్కువగా చదివించి ఏదో ఒక పనిలో పెట్టడం మానేసి.. పిల్లలను పెద్ద పెద్ద చదువులు చదివించడానికి కూడా ఇష్టపడుతున్నారు. అయితే నేటి టెక్నాలజీ యుగంలోఎంతోమంది యువత పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. కానీ ఎందుకో చిన్న చిన్న విషయాలకు మాత్రం విచక్షణతో ఆలోచించ లేకపోతున్నారేమో అని అనిపిస్తూ ఉంటుంది వెలుగులోకి వచ్చే ఘటనలను చూస్తూ ఉంటే.


 ఎందుకంటే ఇటీవల కాలంలో చిన్న చిన్న కారణాలకే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఏ చిన్న సమస్య వచ్చిన అక్కడితో జీవితం ముగిసిపోయింది అని భావిస్తూ.. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. వెరసి ఇలాంటి నిర్ణయాల కారణంగా తమ మీదే ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు తీరని కడుపుకోతను మిగులుస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇలాంటి తరహా ఘటనలు కోకోళ్ల లుగా వెలుగులోకి వస్తున్నాయ్. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. ఏకంగా ఎంబిబిఎస్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.


 అది కూడా అనూహ్యమైన రీతిలో అతను ఆత్మహత్య చేసుకోవడం అందరిని షాక్ కి గురి చేసింది అని చెప్పాలి. ఏకంగా తన పురుషాంగాన్ని కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది అని చెప్పాలి. పాపిరెడ్డి నగర్ రోడ్ నెంబర్ 18 లో ఘటన వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అన్న విషయం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: