ఈ మధ్య కాలంలో భారత దేశం లో ఆత్మహత్యలు ఎక్కువైపోతున్నాయి. పొద్దున్న లేచి న్యూస్ పేపర్ చూస్తే ఒక్క ఆత్మహత్య న్యూస్ అయినా ఉండి తీరుతుంది. చిన్న చిన్న కారణాల వలన  ఆత్మహత్యకు పాల్పడుతున్నారు నేటి యువత. తాజాగా మన దేశం లో జరుగుతున్నా ఆత్మహత్యల పై ది లాన్సెట్ రీజనల్ హెల్త్ అనే మెడికల్ జర్నల్ ఒక రిపోర్ట్ ను ప్రచురించింది. ఈ రిపోర్ట్ లో వెలువడిన విషయాలు కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. మరి ఆ రిపోర్ట్ ఏం వెల్లడించిందో ఇప్పుడు చూదాం.

ది లాన్సెట్ రీజినల్ హెల్త్ ఈ రిపోర్ట్ ని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారి డేటా ఆధారంగా .
ప్రచురించింది. ఈ నివేదిక ప్రకారం మన దేశంలో ఆడవారి కంటే మగవారే ఎక్కువ ఆత్మహత్యలకు పాలపడుతున్నారట. ఆడవారితో పోలిస్తే మగవారి ఆత్మహత్యల సంఖ్య 2.6  రెట్లు అధికంగా ఉంది. ఈ నివేదిక ప్రకారం గడిచిన ఏడేళ్లలో మన దేశంలో పురుషుల ఆత్మహత్యల సంఖ్య మూడింట ఒక వంతు పైగా పెరిగింది. ఈ నివేదిక ప్రకారం 2021 లో 45  వేల 26 మంది మహిళలు బలవన్మరణానికి పాల్పడగా, మగవారిలో ఈ సంఖ్య 1,18,979 గా ఉంది. ఈ గణాంకాలు 2014 లో 42,521 (మహిళలు), 89,129 (పురుషులు) గా ఉన్నాయ్. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బలవన్మరణానికి పాల్పడిన పురుషులలో పెళ్లైన వారే ఎక్కువ. ఆత్మహత్యకు పాల్పడుతున్నవారిలో ఎక్కువ మంది 30  నుంచి 44 ఏళ్ళ మధ్య ఉన్నవారే అని ఈ నివేదిక చెబుతోంది. వీరిలో రోజువారీ కూలీలు ఎక్కువ.

ఆత్మహత్యలకు గల కారణాలను కూడా ఈ నివేదిక వెల్లడించింది. పురుషులలో ఎక్కువ మంది ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యల కారణంగా ఆమహత్యకు పాల్పడుతున్నారట. ఐతే మహిళలలో ఆత్మహత్యలు తక్కువగా ఉండటానికి గల కారణమా వారి కోపింగ్ మెకానిజం కావచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ నివేదిక ప్రకారం 2014 తో పోలిస్తే 2021 లో పురుషులలో ఆత్మహత్యల సంఖ్య 33.4  శాతం పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: