ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే  ప్రతి మనిషిలో కూడా ప్రాణాలపై తీపి మరింత పెరిగిపోతోంది అని చెప్పాలి. ఎందుకంటే మనిషి ప్రాణం ఎప్పుడు ఎలా పోతుంది అన్నది ఊహకందని విధంగానే మారిపోయింది. సాధారణంగా తల్లి కడుపు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదో పెద్ద ఆరోగ్య సమస్య ఉంటేను.. లేదంటే వృద్ధాప్యం వస్తేనో ప్రాణాలు పోయేవి అని అందరూ అనుకునేవారు. కానీ ఇటీవల కాలంలో ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉన్నప్పటికీ కూడా ఊహించని రీతిలో క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.


 పసిపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ చూస్తుండగానే కుప్పకూలిపోయి నిమిషాల్లో ప్రాణాలు వదులుతున్నారు అని చెప్పాలి. ఇక ఇలాంటి ఘటనలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలో కూడా ప్రాణాలపై తీపి మరింత పెరిగిపోతుంది అనడంలో సందేహం లేదు. సడన్ హార్ట్ ఎటాక్లు ఇలా ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరిని కూడా బెంబేలెత్తిస్తూ ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో సడన్ హార్ట్ ఎటాక్ లకి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ అందరిని మరింతగా భయపెడుతూ ఉన్నాయి అని చెప్పాలి.


 ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. ఆ బాలిక తొమ్మిదవ తరగతి చదువుతుంది. ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు. కానీ ఇటీవలే ఒక్కసారిగా పరీక్ష రాసేందుకు వెళ్లి కుప్పకూలిపోయింది. ఏం జరిగిందా అని టీచర్లు వచ్చి చూసారు. అందరూ ఒక్కసారిగా షాక్. ఎందుకంటే సడన్ హార్ట్ ఎటాక్ తో ఆ బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన గుజరాత్ లో వెలుగులోకి వచ్చింది రాజ్కోట్ జిల్లాలోని జస్టిన్ లో ఉన్న  పాఠశాలలో సాక్షి రాజోసర అనే 15 ఏళ్ల విద్యార్థిని పరీక్ష కేంద్రంలో కుప్పకూలిపోయింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: