ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా దొంగలు బెడద కాస్త ఎక్కువగానే కనిపిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది అందినకాడికి దోచుకుపోయి ఇక జల్సాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. వెరసి ఇలాంటి తరహా ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా కాస్త భయాందోళనకు గురి చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఒక్కొక్కరు దొంగతనం చేయడం విషయంలో ఒక్కో పద్ధతిని పాటిస్తూ ఉంటారు. కొంతమంది ఇళ్లల్లోకి చొరబడి చోరీలకు పాల్పడుతూ ఉంటే ఇంకొంతమంది.. దారిదోపిడీలు చేస్తూ ఉంటారు అని చెప్పాలి.


 మరి కొంతమంది ఇంకాస్త వినూత్నమైన రీతిలో ఇలా చోరీలకు పాల్పడుతూ ఇక అందరిని అవాక్కేలా చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో టెక్నాలజీని బాగా వినియోగించుకుంటున్న దొంగలు ఇక పోలీసులకు సైతం ఎక్కడ చిన్న క్లూ కూడా దొరకకుండా చోరీలకు పాల్పడుతున్న ఘటనలు నేటి రోజుల్లో చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు వరకు చిన్న చిన్న వస్తువులు కార్లు వాహనాలు దోచుకు వెళ్లడం చూసాము. కానీ ఏకంగా సెల్ఫోన్ టవర్ ఎత్తుకెళ్లడం గురించి ఎప్పుడైనా విన్నారా.. సెల్ఫోన్ టవర్ ఎత్తుకెళ్లడమేంటి అంత పెద్ద టవర్ ను ఎలా చోరీ చేస్తారు. అసాధ్యం అంటారు ఎవరైనా..


 ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో మాత్రం ఇలాంటి ఒక విచిత్రమైన దొంగతనం జరిగింది. కాశంబి జిల్లాలోని ఉజ్జయిని గ్రామంలో 10 టన్నుల బరువున్న 50 మీటర్ల ఎత్తైన మొబైల్ టవర్ ను దుండగులు ఎత్తుకు వెళ్లారు. మార్చి 31వ తేదీ నుంచి టవర్ కనిపించడం లేదని   ఇటీవలే సాంకేతిక నిపుణులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే టవర్ మాత్రమే కాదు టవర్ తో పాటు 8.5 లక్షల విలువైన షెల్టర్ ఇతర పరికరాలు కూడా మాయమైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు సాంకేతిక నిపుణులు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: