
అయితే ఒకప్పుడు కేవలం బయట వ్యక్తుల నుంచి మాత్రమే అపాయం పొంచి ఉందని.. ఇక సొంత వారు పక్కన ఉంటే అంతకంటే భరోసా ఏం ఉండదు అని నమ్మేవారు. కానీ ఇప్పుడు సొంతవారే ఏకంగా ఉన్మాదులుగా మారిపోయి ప్రాణాలు తీస్తూ ఉన్నారు. కట్టుకున్న వారు కడుపున పుట్టిన వారు అనే తేడా లేకుండా దారుణంగా హత్యలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కొవలోకి చెందినదే అని చెప్పాలి. ఏకంగా తన పసుపు కుంకులకు కూడా కనీస విలువ ఇవ్వని మహిళ.. కొడుకుతో కలిసి దారుణంగా భర్తను చంపేసింది.
ఈ దారుణ ఘటన మెదక్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. మహారాష్ట్రకు చెందిన ప్రకాష్ మాధవ్ అనే 42 ఏళ్ల వ్యక్తి కుటుంబంతో కలిసి నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి పరిధిలో ఉంటూ కాలేశ్వరం కాలువ పనులు చేస్తూ జీవనం సాగిస్తూ ఉన్నాడు. అయితే ప్రకాష్ తన భార్యకు మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేది. ఈ క్రమంలోనే భార్యను తరచు కోరుతూ ఉండేవాడు ప్రకాష్. ఈ క్రమంలోనే ఇటీవల రాత్రి సమయంలో కూడా మరోసారి భార్యతో గొడవ జరిగింది. ఇక ప్రకాష్ మరోసారి భార్యపై చేయి చేసుకోగా.. భార్య కొడుకుతో కలిసి పదునైన ఆయుధాలతో ప్రకాష్ పై దాడి చేసి చంపేసింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.