సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితం లో పెళ్లి అనేది ఒక ముఖ్యమైన ఘట్టం. ఏకంగా తమను అర్థం చేసుకునే భాగస్వామిని జీవితంలోకి ఆహ్వానించి వారితో కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ జీవితాంతం సంతోషంగా ఉండాలని యువతి యువకులు అనుకుంటూ ఉంటారు. అయితే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత ఇక తమ పెళ్ళి రోజును ప్రతి ఏడాది ఎంతో ఘనంగా జరుపుకోవడం కూడా చూస్తూ ఉంటాం అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే కొంతమంది కేవలం పెళ్లిరోజు నాడు కేక్ కట్ చేసి మాత్రమే సెలబ్రేషన్ చెప్పుకుంటే.. ఇంకొంతమంది ఇక దగ్గరలో ఉన్న ఫేమస్ టెంపుల్కు వెళ్లి దేవుడి ఆశీర్వాదం పొందాలని అనుకుంటూ ఉంటారు  ఇంకొంద మంది డబ్బు ఉన్న వాళ్ళు ఏకంగా పెద్ద పార్టీ నిర్వహించి బంధువులందరిని పిలిచి ఘనంగా పెళ్లి రోజును జరుపుకోవడం చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ ఒక జంట మాత్రం ఏకంగా తమ 17వ వివాహ వార్షికోత్సవాన్ని ఏకంగా చెత్తాచెదారం మధ్య మురికి కాలువలో జరుపుకోవడం గమనార్హం. మురికి కాలువలో వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకోవడం ఏంటి వాళ్లకి ఏమైనా పిచ్చా అంటారా.


 అయితే ఇక్కడ ఈ జంట 17వ వెడ్డింగ్ యానివర్సరీని అటు మురికి కాలువలో జరుపుకోవడానికి వెనుక ఒక మంచి కారణమే ఉంది. ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రానగరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నాగ్లా ఖాళీ ప్రాంతంలో రోడ్డు మురుగు కాలువను తలపిస్తుంది. 8 నెలలుగా అపరిశుభ్రత నెలకొనడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికార యంత్రం గానికి ఫిర్యాదు చేసిన ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. దీంతో స్థానికంగా ఉండే భగవాన్ శర్మ, ఉమా దంపతులు వినూత్నంగా తమ 17వ పెళ్లిరోజు వేడుకలను మురికి కాలువల మారిపోయిన ఆ రోడ్డుమీద జరుపుకొని నిరసన తెలిపారు. ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: