భార్యాభర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి. ఒంటరిగా సాగిపోతున్న జీవితానికి ఇక జీవితాంతం కలిసి ఉండే తోడును ఇచ్చేది పెళ్లి బంధం. ఇక ఇలా పెళ్లి అనే కార్యంతో వైవాహిక బంధం లోకి అడుగుపెట్టిన తర్వాత కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడు నీడగా ఉండాలి. ఎంత కష్టమైనా పరిస్థితులు వచ్చినా నేనున్నాను అని ఒకరికి ఒకరు భరోసా ఇచ్చుకోవాలి. ఇంతటి అన్యోన్యత ఉంటుంది కాబట్టి.. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో రకాల బంధాలు ఉన్నా అటు దాంపత్య బంధం మాత్రం ఎంతో ప్రత్యేకమైనది అని పెద్దలు చెబుతూ ఉంటారు.



 అయితే భార్య పక్కన ఉంటే టార్చర్ అంటూ సినిమాల్లో ఎన్ని జోకులు వేసిన.. ఆ భార్య పక్కనుంటేనే మగాడి జీవితం సార్థకం అవుతుంది అన్నది మాత్రం అందరికీ తెలిసిన నిజం. కానీ ఇటీవల కాలంలో మాత్రం దాంపత్య జీవితంలో ఇలాంటి అన్యోన్యత ఎక్కడ కనిపించడం లేదు. ఏకంగా చిన్నచిన్న కారణాలకే మనస్పర్ధలతో విడిపోవడానికి సిద్ధమవుతున్న వారు ఎక్కువగా కనిపిస్తున్నారు. అంతేకాదు ఇంకొంతమంది చిన్నచిన్న కారణాలకి క్షణికావేషంలో నిర్ణయాలు తీసుకుంటూ చివరికి బలవన్మరణాలకు పాల్పడేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటీవల మెదక్ జిల్లా చిలప్ చేడ్ మండలంలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది.


 బండ పోతుగల్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సయ్యద్ ఇస్మాయిల్ అనే వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. అయితే మద్యం మానేసి ఏదైనా పని చూసుకోవాలని కుటుంబ నిర్వహణ కష్టం అవుతుంది అంటూ అతని భార్య నదియా బేగం మందలించింది. దీంతో ఎంతగానో మనస్థాపం చెందిన ఇస్మాయిల్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే గమనించిన స్థానికులు తీవ్ర అస్వస్థతకు గురైన అతన్ని ఆసుపత్రికి తరలించారు. చివరికి చికిత్స పొందుతూ ఇటీవల మృతి చెందాడు. ఇస్మాయిల్ భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: