గతంలో ఉగ్రవాదులు భారత్ దేశాన్ని భయపెట్టడానికి అనేక సార్లు తమ విద్వేషపూరిత చర్యలు చేపట్టారు. దేశ రక్షణలో ఉన్నటువంటి మన సైన్యం మీద దురాక్రమణలు చేసి చంపుతూ ఉండేవారు. అంతే కాకుండా దేశం లోపలికి చొరబడి ముఖ్యమైన నగరాల్లో బాంబు దాడులకు పాల్పడుతూ ఉండేవారు. తాజాగా పంజాబ్ లో ఖలిస్తానీ తీవ్రవాదులను టార్గెట్ చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిఘా సంస్థలు.


వేర్పాటువాద సంస్థకు చెందిన ఉగ్రవాది లక్బీర్ సింగ్ లాండా అతని అనుచరులకు చెందిన 48 ప్రాంతాల్లో సోమవారం పంజాబ్ కు చెందిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఫిరోజ్ పూర్ దగ్గరలోని ప్రాంతాల్లో తనిఖీలు జరిగాయి.  ఫిరోజ్ పూర్  లబ్బీర్ కు సంబంధించిన మనుషులు బెదిరింపులకు, నగదు దొంగతనాలకు పాల్పడ్డారు. గతంలో ఇదే ప్రాంతంలో ఒక వర్తకుడు పైకి ఇద్దరు ముసుగు దొంగలు కాల్పులు జరిపారు.


నిషేధిత ఖలిస్తాని వేర్పాటువాద సంస్థ బర్బర్ కల్సా ఇంటర్నేషనల్ కి చెందిన శర్మేందర్ సింగ్ కైరా అలియాస్ సద్దు, సప్నార్ సింగ్ అలియాస్ సత్నాం సింగ్ అలియాస్ సట్టా, గద్వీందర్ సింగ్ అలియాస్ గడ్డాల ఆచూకీ తెలిపితే పది లక్షలు బహుమతిగా ఇస్తామని ప్రకటించారు పంజాబీ పోలీసులు. లబ్బీర్ హర్విందర్ సింగ్ సందు అలియాస్ రెండాల ఆచూకీ తెలపాలని పోలీసులు గతంలోనే కోరడం  జరిగింది.


లబ్బీర్ రెండాల సమాచారం అందిస్తే తలపై 10 లక్షలు ఇస్తామని పోలీసులు గతంలోనే ప్రకటించారు. పంజాబ్ లో వాళ్లు శాంతి సామరస్యాలకు అవాంతరం కలిగిస్తున్నారు. దేశ వ్యతిరేక ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ ఐ ఏ వీరి వెనక కేసులు కూడా నమోదు చేసింది. లబ్బీర్ రెండాల కోసం గాలింపులు చేపడుతుంది ఎన్ ఐ ఏ. ఉగ్రవాదుల ఉపకరణాలు, మత్తు పదార్థాలు పంజాబ్ కు తరలించి దాని నగదు బాగా కూడబెట్టి ఖలిస్తానీ ఉద్యమం కోసం ఖర్చు పెడుతున్నారట. వీళ్ల కోసం  గాలింపు చర్యలు చేపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: