హమాస్ ఉగ్రవాదుల దాడులను ఇజ్రాయిల్ సైన్యం సమర్థంగా ఎదుర్కొని గాజాలో విస్తృతంగా దాడులు చేస్తోంది. గాజాలో ఇప్పటి వరకు 93 మంది ఇజ్రాయిల్ సైనికులు యుద్ధంలో మరణించారు. అయితే గాజాలో సామాన్య ప్రజలను అడ్డు పెట్టుకుని విధ్వంసాలకు హమాస్ టెర్రరిస్టులు పాల్పడుతున్నారు. వెస్ట్ బ్యాంకులో ఇజ్రాయిల్ సైన్యంపై ఎదురు దాడికి దిగిన హమాస్ ఉగ్రవాదులను ఎరిపారేశారు. సాధారణ ప్రజలను అడ్డు పెట్టుకుని చాలా దారుణాలకు హమాస్ పాల్పడుతుంది. హమాస్ వల్ల అక్కడ ఉండే పిల్లలు, మహిళలు, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది.


ముఖ్యంగా యుద్ధం భీకరంగా మారడంతో ఏం చేయాలో తోచని పరిస్థితి నెలకొంది. అయితే దక్షిణ గాజాలో కూడా దాడులు పెంచిన ఇజ్రాయిల్ సైన్యం హమాస్ ను పూర్తిగా లేకుండా చేస్తామని ప్రతిన బూనింది. దీంతో దక్షిణ గాజాలో గాయపడిన వారిని అంబులెన్స్ ల్లో హాస్పిటల్స్ కు తరలిస్తున్నారు. అయితే ఈ సమయంలో అంబులెన్స్ ల్లో హమాస్ ఉగ్రవాదులు తప్పించుకున్నట్లు ఇజ్రాయిల్ సైన్యం పసిగట్టింది.


దీంతో అంబులెన్స్ లను చెక్ చేసే సమయంలో అక్కడ ఇజ్రాయిల్ సైన్యానికి, అంబులెన్స్ లలో ఉన్న హమాస్ టెర్రరిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. దీంట్లో హమాస్ ఉగ్రవాదులను ఇజ్రాయిల్ ఆర్మీ ఫోర్స్ చంపేసింది. అంటే పేద ప్రజలను, చిన్నారులను ఎంతలా ఉపయోగించుకుని టెర్రరిజాన్ని పెంచుతున్నారో అర్థం చేసుకోవచ్చు.


హమాస్ ను చివరి వరకు లేకుండా చేస్తామని చెప్పిన ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజిమన్ నెతన్యాహు దానికి కట్టుబడి ఉన్నామని మరో మారు ప్రకటించారు. ఈ మధ్యే కాల్పుల విరమణ పాటించాలని ఐక్య రాజ్య సమితిలో పెట్టిన తీర్మానాన్ని అమెరికా వీటో ను ఉపయోగించి తొలగించింది. ఇజ్రాయిల్ కు అండగా నిలబడింది. ఇప్పుడు కాల్పుల విరమణ పాటిస్తే రాబోయే రోజుల్లో హమాస్ ఉగ్రవాదులు మరిన్ని దాడులు చేసే అవకాశం ఉందని తేలడంతో గాజాలో యుద్దం కొనసాగాల్సిందేనని మద్దతు పలికింది. దీంతో గాజాలో పరిస్థితులు మరింత దిగజారి పోయే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: