
కానీ ఇవేవీ పట్టించుకోకుండా టీడీపీతో పొత్తు పెట్టుకుంటాం. బీజేపీతో కలుస్తాం. ఎలాగైనా వైసీపీని ఓడించడమే లక్ష్యం అంటూ ప్రకటనలు ఇస్తూ వచ్చారు. దీంతో టీడీపీ వారి దృష్టిలో చులకన మారిపోయారు. అంతే కాకుండా పవన్ ను నమ్ముకున్న వారు దెబ్బతినే అవకాశం ఏర్పడింది.
కన్నా, మహాసేన రాజేశ్ జనసేనలో టికెట్ వస్తుందని అనుకుని ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించారు. పొత్తు గురించి ముందుగానే డిసైడ్ చేసుకుని రెండు పార్టీల్లో ఎవరెవరికి టికెట్లు ఇస్తున్నారో తేల్చుకోవాలి.
ఇదంతా జరగక ముందే పొత్తు గురించి పవన్ మాట్లాడే సరికి టీడీపీ నాయకులకు మరింత చులకనగా మారిపోయారు. పవన్ కల్యాణ్ ఈ విషయాన్ని గమనించి తెలుగుదేశం పార్టీలో గతంలో గెలిచిన ఈదర హరిబాబును జనసేనలో చేర్చుకున్నారు. టీవీ రామారావు కొవ్వూరు మాజీ ఎమ్మెల్యేను కూడా చేర్చుకున్నారు. వైసీపీని దెబ్బకొట్టేందుకు టీడీపీ సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తుందని జనసేన పార్టీ నాయకుడు హరిరామజోగయ్య అన్నారు.
టీడీపీతో జనసేన పొత్తుకు సై అంటుందని తెగ ప్రచారం చేసేస్తున్నారు. దీంతో జనసేనలో చేరాలనుకున్న కన్నా, మహసేన రాజేశ్ లాంటి ప్రముఖులు టీడీపీ లో చేరి పోయారు. ఇలాంటి విషయాల్ని ఎవరూ నమ్మవద్దని జోగయ్య అన్నారు. చంద్రబాబుకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి కూడా జనసేన సిద్దంగా ఉందంటూ విష ప్రచారాన్ని చేస్తున్నారని విమర్శించారు.