ఒకసారి కాకపోతే మరోసారి అయినా నీతిగా, నిజాయితీగా వ్యవహరిస్తే పెద్దమనిషి అనే గౌరవ మర్యాదలు నిలబడతాయి. అందులోనూ బాధ్యతాయుతమైన పదవులు అనుభవించి విశేష అనుభవం ఉన్నవారు మరింత హుందాగా వ్యవహరించాలి అప్పుడే వారి పెద్దరికం నిలబడుతుంది. అలా కాకుండా చౌకబారు విమర్శలు, చేష్టలతో ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరిస్తే జీవితం నవ్వులపాలు అవ్వడమే కాకుండా అప్పటి వరకు ఉన్న గౌరవ మర్యాదలు మొత్తం కోల్పోవాల్సిందే. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యవహారశైలి గురించే. ఇప్పటికి ఆయనకు వయస్సు ఏడు పదులు నడుస్తున్నాయి. సుమారు పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయన సొంతం. అటువంటి అనుభవశాలి ఇంతటి విపత్కర పరిస్థితుల్లో వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు విమర్శలపాలవుతోంది. 

 

IHG


గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఎన్నో అక్రమాలు, అవినీతి వ్యవహారాలు చోటుచేసుకున్నాయి. చంద్రబాబు పూర్తిగా పార్టీ నాయకులపై పట్టు కోల్పోవడంతో ఎవరికి వారు తమ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించారు. దాని కారణంగానే 175 స్థానాలకు గాను, కేవలం 23 స్థానాలకు మాత్రమే టిడిపి పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు టిడిపి ప్రతిపక్షంలో ఉంది. ఈ సమయంలో హుందాగా రాజకీయ విమర్శలు చేస్తూ, ప్రజా సమస్యల ఈ విషయంలో ప్రభుత్వంపై పోరాడుతూ, అలాగే  తన విశేష అనుభవంతో ప్రభుత్వానికి తగిన సలహాలు, సూచనలు ఇస్తూ ఏపీ అభివృద్ధికి సహకరించాల్సింది పోయి ప్రభుత్వం మంచి చేస్తున్నా, దానిపైనా బురద జల్లేందుకు ప్రయత్నిస్తూ చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం ఏపీలో కరోనా తీవ్ర స్థాయిలో ఉంది. 

 

IHG


ఈ సమయంలో ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన బాబు ప్రభుత్వంపై ఉన్న అక్కసుతో యధావిధిగా రాజకీయ విమర్శలకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇప్పుడు విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనలో చంద్రబాబు అదే విధంగా వ్యవహరిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం విశాఖ గ్యాస్ సంఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. దీనిపై ప్రజల్లోనే కాకుండా అన్ని పార్టీల్లోనూ జగన్ తీరు పై ప్రశంసలు కురుస్తున్నాయి. పార్టీలకు అతీతంగా జగన్ నిర్ణయాన్ని అందరూ స్వాగతించారు. అలాగే ఎల్జి పాలిమర్స్ కంపెనీ నుంచి కూడా నష్ట పరిహారాన్ని కూడా వసూలు చేస్తామని జగన్ ప్రకటించారు. 

 

IHG

 

టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్గ్రేషియాను కూడా తక్కువగా చేసి చూపించడం, కోటి కాదు 10 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తుండడంపై తెలుగుదేశం శ్రేణుల నుంచే కాకుండా ప్రజల నుంచి కూడా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ఈ సమయంలో హుందాగా వ్యవహరించాల్సి ఉండగా, ఇలా చౌకబారు విమర్శలు చేస్తూ, తన స్థాయిని తగ్గించుకుంటున్నారు అంటూ విమర్శిస్తున్నారు. విశాఖలో విషాద సంఘటన జరిగిన తర్వాత చంద్రబాబు వ్యాఖ్యలు కూడా హాస్యాస్పదంగా ఉన్నాయి.

 

IHG'hardcore extremist', urges ...

 తాను ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే వెంటనే ప్రమాద స్థలానికి వెళ్లేవాడినని చంద్రబాబు చెబుతున్నారు. ప్రమాదకరమైన విష వాయువులు ఉన్న చోటికి ఏపీ సీఎం జగన్ వెళ్లేసరికి ఇంకా ఆ విష వాయువుల ప్రభావం పోలేదు. ఇప్పటికీ అక్కడ ప్రజలను అనుమతించడం లేదు. నిపుణులు గాలిలో విషవాయువులు లేకుండా ప్రయత్నిస్తున్నారు. మరో ఒకటి, రెండు రోజులు ఆగితే తప్ప సాధారణ పరిస్థితి వచ్చేలా కనిపించడం లేదు. అయితే చంద్రబాబు మాత్రం తాను సీఎంగా ఉండి ఉంటే.. ఘటనా స్థలానికి వెళ్లి ఉండేవాడినని,  చెప్పడంపై బాబు పై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఇక పరిహారం విషయంలోనూ చంద్రబాబుపై అదే స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

 

అసలు కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఏ ప్రమాదంలో ఇచ్చిన దాఖలాలు లేవు. 2014లో తూర్పుగోదావరి జిల్లా నగరం గ్రామంలో గ్యాస్ పైప్ లైన్ లీకయ్యి   అనేక మంది మరణించారు. అప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో బాధిత కుటుంబాలకు కేవలం మూడు లక్షల ఎక్స్గ్రేషియా మాత్రమే ప్రకటించారు. గెయిల్ సంస్థ 20 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రెండు లక్షలు ప్రకటించింది. ఇప్పుడు ఆ విషయాన్ని కూడా వైసీపీ శ్రేణులు గుర్తు చేస్తున్నారు. ఇక విశాఖపట్నంలో గ్యాస్ లీకేజ్ సంఘటన విషయంలో ఏపీ సీఎం జగన్ మానవీయ కోణంలో స్పందించి బాధితులకు కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. 

 


దీనిని కూడా టిడిపి అధినేత చంద్రబాబు రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా ప్రతి విషయంలోనూ అసంబద్ధంగా వాదించడం కారణంగా తరచుగా ఆయన నవులపాలవుతున్నారు. చంద్రబాబుకు వయసు పెరిగే కొద్దీ చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో హేళన చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: