జగన్ చేస్తున్న రాజకీయం కాస్త గందరగోళంగానే కనిపిస్తోంది. జగన్ వాయు వేగంతో దూసుకు వెళుతూ, అన్ని వ్యవస్థలపైన పట్టు సాధించేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అటు కేంద్రంతో సఖ్యత గా ఉంటూ, తనకు కావాల్సిన అన్ని పనులను చకచకా చేయించుకుంటున్నారు. అలాగే ఏపీలో ప్రభుత్వంపై ప్రజల్లో ఎక్కడా వ్యతిరేకత లేకుండా, అన్ని వర్గాల ప్రజలకు ఏం కావాలో ముందుగానే తెలుసుకుని వాటిని అమలు చేసి చూపిస్తున్నారు. ఎక్కడ వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తి ఏర్పడకుండా, జగన్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ముఖ్యంగా తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా చేయడమే పనిగా పెట్టుకోవడం తో పాటు, ఇప్పటి వరకు చంద్రబాబు సంపాదించుకున్న పరువు ప్రతిష్టలను దెబ్బతీసి, ఆయనపై చేరపలేని విధంగా ముద్ర వేయాలనే విధంగానే జగన్ వ్యవహరిస్తున్నారు. 


అందుకే చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ పై ఎన్నో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వాటన్నిటినీ పక్కన పెట్టినట్టుగానే వ్యవహరిస్తూ, చుట్టూ ఉన్న నాయకులందరినీ ఒక్కొక్కర్ని పార్టీకి దూరం చేసుకుంటూ వస్తున్నారు. గతంలో వారిపై వచ్చిన అవినీతి వ్యవహారాలు, అన్నింటిని దర్యాప్తు చేస్తూ జైలు బయట పట్టిస్తున్నారు. ఈ విషయంలో కేంద్రం తమకు అడ్డు తగలకుండా ఉండేందుకు వారితో సఖ్యతగా మెలుగుతున్నారు. దీని కారణంగా ఏపీలో జనసేన, బీజేపీ నాయకులు తనకు ఏ విషయంలోనూ అడ్డం పడరు అనేది జగన్ ప్లాన్. అలాగే టీడీపీ చేసే పోరాటాలకు బీజేపీ జనసేన మద్దతు ఉండకుండా చేసేందుకు జగన్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. 


ఇక ఇవే కాకుండా, వివిధ వ్యవస్థల్లో పాతుకుపోయిన బాబు మనుషులను ఒక్కొక్కరిని జగన్ దూరం చేయాలని చూస్తున్నారు. దీనిలో భాగంగానే సుప్రీంకోర్టు న్యాయమూర్తి రమణ, బాబు  స్నేహం ఎప్పటికీ కాదు. ఎప్పటి నుంచో వీరిద్దరి మధ్య బంధం ఉందని దాని కారణంగానే న్యాయవ్యవస్థను కూడా ప్రభావితం చేస్తున్నారు అనే ఆరోపణలతో జగన్ ప్రధాన న్యాయమూర్తి లేఖలో ఫిర్యాదు చేశారు. అలాగే ఇదే విషయమై రాష్ట్రపతిని కలిసేందుకు జగన్ ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ పరిణామాలను చూస్తుంటే టీడీపీకి రానున్న రోజుల్లో గడ్డుకాలమే అన్న విషయం అర్థమవుతోంది. ఇదే భయం లోకేష్ చంద్రబాబు లో ఈ మధ్య కాలంలో ఎక్కువ అయినట్టుగా కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: