‘ఎన్టీయార్ కు భారతరత్న వచ్చేవరకు పోరాటం చేస్తునే ఉంటాం’    ఇది తాజాగా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్య. నిజంగా ఎన్టీయార్ కు భారతరత్న విషయంలో చంద్రబాబు వేసినన్ని డ్రామాలు ఎవరు వేయలేదంటే అతిశయోక్తి కాదు. అధికారంలో ఉన్నపుడు ఎప్పుడు కూడా ఎన్టీయార్ కు భారతరత్న ఇప్పించాలని చంద్రబాబుకు జ్ఞాపకం రాదు. ఎప్పుడైతే ప్రతిపక్షంలోకి వచ్చేస్తారో వెంటనే ఎన్టీయార్ కు భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ను చంద్రబాబు మొదలుపెట్టేస్తారు. ఈ విషయాన్ని అర్ధంచేసుకోలేని తెలుగు జనాలు ఉండరు. వెన్నుపోటు పొడిచి ఎన్టీయార్ చావుకు కారణమైన వాళ్ళే ఇపుడు ఆయన విగ్రహాలపై పూలుజల్లి, ఘాట్ దగ్గర నివాళులర్పించి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయటమే చాలా విచిత్రంగా ఉంది.




ఇదే విషయాన్ని ఎన్టీయార్ వీరాభిమాని, మంత్రి కొడాలి నాని ప్రస్తావిస్తు చంద్రబాబు బతికుండగా ఎన్టీయార్ కు భారతరత్న వచ్చే అవకాశం లేదని కుండబద్దలు కొట్టకుండానే చెప్పేశారు. ఢిల్లీలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు మరప్పుడు ఎన్టీయార్ కు భారతరత్న ఎందుకు ఇఫ్పించలేకపోయారన్న కొడాలి ప్రశ్నకు ఎల్లోబ్యాచ్ నుండి సమాధానం ఉండదు. చంద్రబాబు అండ్ కో వల్ల చివరకు ఎన్టీయార్ కు భారతరత్న అన్న విషయం నవ్వులాటగా మారిపోయిందనటంలో సందేహం లేదు. పైగా ఎన్టీయార్ ఘాట్ వద్ద చంద్రబాబు మాట్లాడుతూ భారతరత్న సాధించేందుకు డెడ్ లైన్ ప్రకటించటమే విచిత్రంగా ఉంది. ఎన్టీయార్ శతజయంతిలోగా భారతరత్న సాధిస్తామని చేసిన ప్రకటనను అందరు పెద్ద జోక్ గా తీసుకుంటున్నారు.




ఇదే విషయమై ఎన్టీయార్ సతీమణి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీయార్ కు భారతరత్న ఇవ్వటానికి చంద్రబాబు పూర్తిగా వ్యతిరేకమంటూ ఆరోపణలు గుప్పించారు. ఎన్టీయార్ కు భారతరత్న ప్రకటిస్తే ఆయన భార్య హోదాలో ఆ పురస్కారాన్ని తాను తీసుకుంటానని చెప్పారు. ఎన్టీయార్ భారతరత్న పురస్కారాన్ని తాను తీసుకోవటం చంద్రబాబు అండ్ కో కు ఇష్టం లేదని అందుకనే ఇన్ని డ్రామాలాడుతున్నట్లు లక్ష్మీపార్వతి మండిపడ్డారు. మొత్తానికి ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారం డిమాండ్ వెనుక ఇంత రాజకీయాలు ఉన్నాయని మామూలు జనాలు ఆశ్చర్యపోతున్నారు. నిజానికి చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నాకూడా ఎన్టీయార్ కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఎవరు వినలేదు. ప్రతిపక్షంలోకి వచ్చినపుడు మాత్రమే అందులోను వర్దంతి, జయంతి సందర్భంగా మాత్రమే ఎన్టీయార్ కు భారతరత్న పురస్కారం చంద్రబాబుకు గుర్తుకురావటం నిజంగా ఆశ్చర్యమే.


మరింత సమాచారం తెలుసుకోండి: