ప్రధానమంత్రి నరేంద్రమోడికి రాజకీయంగా బ్యాడ్ టైం స్టార్టయినట్లేనా ? అవుననే అంటున్నాయి ప్రతిపక్షాలు. ఇంతకీ ఐదురాష్ట్రాల్లో పోలింగ్ జరగకుండానే మోడికి బ్యాడ్ టైం స్టార్టయ్యిందని ఎలా అంటున్నారు ? ఎలగంటే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాల ఆధారంగానే. మొన్న ఫిబ్రవరిలో ఢిల్లీలోని ఐదు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఈ ఐదు కార్పొరేషన్లలోను ఒక్కటంటే ఒక్కదానిలో కూడా బీజేపీ గెలవలేకపోయింది. నిజానికి ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలకు మన మీడియా పెద్ద ప్రచారం కల్పించలేదు కాబట్టి దక్షిణాది వాళ్ళకు ఆ ఫలితాలపై పెద్దగా సమాచారం లేదు. కానీ వాస్తవం వాస్తవమే కదా. తమకు ఇష్టంలేని వార్తలను, డెవలప్మెంట్లను మీడియా జనాలకు చూపటం లేదన్న విషయం అందరికీ తెలిసిందే.




మోడికి వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలను చాలా మీడియా సంస్ధలు ఫోకస్ చేయటంలేదు. నరేంద్రమోడికి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని గెలుచుకోవటం అన్నది పెద్ద కలగా మారిపోయింది. అయితే వరుసగా మూడు ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), బీజేపీకి భీకరమైన పోటీ జరుగుతోంది. పై రెండు పార్టీలంటే నరేంద్రమోడి-అరవింద్ కేజ్రీవాల్ అనే అర్ధం. అందుకనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల కన్నా మోడి, కేజ్రీవాలే ఎక్కువగా ఫోకస్ అవుతున్నారు. ప్రతి ఎన్నికలోను గెలవటం ద్వారా మోడిని ఆప్ అదినేత ముప్పు తిప్పలు పెడుతున్నారు. మరీ మొన్నటి ఎన్నికల్లో అయితే 70 నియోజకవర్గాల్లో 64 అసెంబ్లీలను గెలుచుకుని మోడిని  కేజ్రీవాల్ చావుదెబ్బ కొట్టింది వాస్తవం.




ఎన్నికల్లో జయాపజయాలు సాధారణమే అన్న విషయాన్ని పక్కన పెట్టేసి కేజ్రీవాల్ పై వ్యక్తిగత కక్ష కట్టినట్లుగా కేంద్రప్రభుత్వంలోని పెద్దలు వ్యవహరిస్తున్నారు. ఇలాంటి అనేక చర్యల వల్ల కేజ్రీవాల్ అంటే దేశంలో ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. మోడి అంటే పడని వాళ్ళంతా అనివార్యంగా కేజ్రీవాల్ కు మద్దతుగా నిలబడ్డారు. ఒకవైపు ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చాలా బిజీగా ఉంది. ఇలాంటి సమయంలో ఢిల్లీలో ఐదు కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి. విచిత్రమేమిటంటే ఐదింటిలో కనీసం ఒక్క కార్పొరేషన్లో కూడా బీజేపీ గెలవలేదు. దేశరాజధాని అయిన ఢిల్లీ  కేజ్రీవాల్ చేతిలో ఉండటాన్ని మోడి అండ్ కో తట్టుకోలేకపోతున్నారు. కానీ ప్రజాబలంతో మూడుసార్లు సీఎం కుర్చీని అందుకున్న కేజ్రీని ఏమి చేయలేకపోతున్నారు. మొత్తానికి కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలతోనే మోడికి బ్యాడ్ టైం స్టార్టయినట్లు ప్రచారం ఊపందుకుంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: