‘చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవా’ అని పెద్దలు ఊరికే అనలేదు. అనవసరంగా గెలిచిన పార్టీ మీదే దుమ్మెత్తిపోశారు. కూర్చున్న కొమ్మనే నరకాలని ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో చివరకు తాను ఉపయోగించిన కత్తి దెబ్బ తనపైనే పడింది. ఇదంతా ఎవరి కోసమో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అవును నరసాపురం వైసీపీ ఎంపి రఘురామ కృష్ణంరాజు వ్యవహారం గురించే. హాయిగా కడుపులో చల్ల కదలకుండా కూర్చోవాల్సిన రాజుగారు అనవసరంగా వివాదాలను కెలుక్కుని చతికలపడ్డారు. టికెట్ ఇచ్చి గెలిపించుకున్న పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితోనే కయ్యానికి కాలుదువ్వారు. చివరకు ఆయనే బోల్తాపడ్డారు. 2019 ఎన్నికల సమయంలో చివరినిముషంలో వైసీపీలో చేరి టికెట్ దక్కించుకోవటమే చాలా ఎక్కువ. అలాంటిది ఏదో గెలిచానంటే గెలిచాననిపించుకున్నారు.




ఇలాంటి పరిస్దితుల్లో జగన్ ముఖ్యమంత్రి కాగానే కారణాలు స్పష్టంగా తెలియవుగానీ జగన్ తో గొడవలు మొదలయ్యాయి. ఎప్పుడైతే జగన్ తో గొడవులు మొదలయ్యాయో వెంటనే ఎంపి పదవికి రాజీనామా చేసుంటే చాలా హుందాగా ఉండేది. ఇఫ్పటి రాజకీయాల్లో టార్చిలైట్ వేసి వెదికినా చాలామందిలో కనిపించని లక్షణం అదే కాబట్టి ఎంపి రాజీనామా చేయలేదని అనుకుందాం. పోనీ రాజీనామా చేయకపోతే పోయారు కనీసం మాట్లాడకుండా అన్నా కూర్చోవాల్సింది. పార్టీలో నేతలతో గొడవలైనా దాన్ని జగన్ కు చుట్టకుండా ఉండాల్సింది. ఇక్కడే ఎంపి చేసిన తప్పులు బాగా కనబడుతున్నాయి.




వైఎస్సార్సీపీ పార్టీ అసలు  జగన్ దే కాదని ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేయటమే ఎంపి చేసిన పెద్ద తప్పు. వైఎస్సార్సీపీ గుర్తును రద్దు చేయాలని పదే పదే డిమాండ్ చేశారు. తాను పోటీచేసిన పార్టీ గుర్తే జగన్ ది కాదని కాబట్టి పార్టీ గుర్తును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేయటమే విచిత్రం. సరే ఈ వివాదం ఇలాగుండగానే జగన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం మొదలుపెట్టారు. జగన్ బెయిల్ రద్దుచేయించి తిరిగి జైలుకు పంపిస్తానంటు చాలెంజ్ చేశారు. చాలెంజ్ చేయటమే కాకుండా కోర్టులో కేసు కూడా వేశారు. జగన్ అసలు రెడ్డేకాదని కాపని కాపంటు రచ్చ మొదలుపెట్టారు. తండ్రి వైఎస్సార్ కాపు అయినపుడు కొడుకు జగన్ రెడ్డి ఎలాగవుతారంటు గోల మొదలుపెట్టారు. చివరగా పదేళ్ళుగా మానసిక సమస్యలకు జగన్ ఇంగ్లాండులో చికిత్స చేయించుకున్న విషయం తనకు తెలుసన్నారు. ఇలాంటి అనవసరమైన చెత్తనంతా నెత్తినేసుకోబట్టి ఇపుడు తిరుగుబాటు ఎంపి 3468 నెంబరు ఖైదీగా జైలులో ఉన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: