ప్ర‌పంచాన్ని మార్చ‌డానికి ఈ రోజు నుంచి నువ్వు చేస్తున్న ప్ర‌యాణానికి ఆల్ ద బెస్ట్ అని చెప్పారు మంచు ల‌క్ష్మి త‌న త‌మ్ముడు మంచు విష్ణును ఉద్దేశిస్తూ..మంచిదే ఇప్పుడిదే ట్రోల్ అవుతోంది. ఎవ‌రి ప్ర‌పంచాన్ని ఎవ‌రు మారుస్తారు అన్న‌దే నెటిజ‌న్ల ప్ర‌శ్న. దీనిపై ఆమె క్లారిఫికేష‌న్ ఇచ్చారు.. కానీ ట్రోల్ మాత్రం ఆగ‌డం లేదు. త‌న  ఉద్దేశాలు అర్థం చేసుకోవాల‌ని చెప్పినా మా అనే ప్ర‌పం చాన్ని మార్చేది ఏంటి.. మారేది ఏంటి? అని ఇంకొంద‌రు అడుగుతున్నారు డిజిట‌ల్ మాధ్య‌మాల్లో మంచు లక్ష్మీ అనే సెల‌బ్రిటీ కిడ్ ను... ఈ నేప‌థ్యంలో ట్రోల్ బాబూ ట్రోల్ పేరిట ఈ క‌థ‌నం చ‌ద‌వండిక.


మా అసోసియేష‌న్ అన్న‌ది చాలా చిన్న‌ది అక్కా.. నీకు తెలియ‌దు అదేం పెద్ద ప్ర‌పంచ‌మేమీ కాదు కానీ కాస్తో కూస్తో ఎవ‌రో ఒక‌రి పెత్త‌నం కిందో, పెంప‌కం కిందో ఉండాల్సిన సంఘం. త‌ప్పేం లేదు మీరు ప్ర‌పంచాన్ని మార్చాలి. నేను కూడా ప్ర‌పంచంను మార్చాలి. ఈ ప‌ని గతంలో శ్రీ‌శ్రీ చేయాల‌నుకున్నాడు. చేశాడో లేదో తెలియ‌దు. అలానే మీ త‌మ్ముడు కూడా మా అసోసియేష‌న్ కు ఓ దారి ఇవ్వాల‌ని అనుకుంటున్నాడు. త‌ప్పేం కాదు. కానీ అదే ప‌నిగా మీరు మీ ప్ర‌పంచాన్ని పొగుడుతూ ఉండ‌కండి. మీకు గ‌ర్వంగా ఉ న్న ప‌నులు మాకు గ‌ర్వంగా లేక‌పోవ‌చ్చు. మీరు ఆనందించే ప‌నులు మేం ఆనందించ‌క పోవ‌చ్చు. అయినా మంచక్కా! మా అసో సియేష‌న్ ను మార్చేది ఏమీ ఉండదు. రెండేళ్ల ప‌ద‌వి అయిపోయాక  అదే మారిపోతుంది. మా అన్న‌ది రంగుల లోకంకు చెందిందే కానీ అన్ని రంగుల‌నూ వంటికి అంటించుకునే సంఘం అయితే కాదు. రాజ‌కీయ ఉద్దేశాల కార‌ణంగానే ఎవ్వ‌రో ఒక‌రు తెర‌పైకి వ స్తారు.మీ తమ్ముడికి టీఆర్ఎస్ జీవ‌న్ రెడ్డి కానీ వైసీపీ జ‌గన్ మోహ‌న్ రెడ్డి కానీ సాయం చేశార‌న్న వార్త‌లున్నాయి. అదేవిధంగా టీడీపీ బాలయ్య కూడా సాయం చేసే ఉండ‌వ‌చ్చు. అది త‌ప్పే కాదు. కానీ త‌ప్పంతా గెలిచాక కూడా మీరు ఇంకా స్టేట్మెంట్లు ఇస్తూనే ఉ న్నారు త‌ప్ప! ఓడిన వారిని క‌లుపుకుని లేదా క‌లుసుకుని పోయే ప్ర‌య‌త్నాలేవీ చేయ‌డం లేదు. మంచిదే ! మీ త‌మ్ముడు మా అసోసియేష‌న్ మార్చితే కానీ ఆ పేరుతోనో ఆ అహంకారంతో నో ఏ త‌ప్పులూ చేయ‌కుండా ఉంటే చాలు.
ప్ర‌పంచం అన్న‌ది అలానే ఉంటుంది. ఉండాలి కూడా! మ‌నం మార్చేది ఏమీ ఉండ‌దు మంచ‌క్కా! అది మారుతూ మారుతూ మ న‌ల్ని మారుస్తుంది. కాబ‌ట్టీ ఈ విష‌యం మీకు బాగా అర్థం అయి ఉండాలా? లేదా అర్థం చేసుకునేందుకు కాస్త‌యినా చొర‌వ తీసు కుని తీరాలా? అదీ క‌ళ..అదే క‌థ కూడా! నోరుంద‌ని కొంద‌రు, డ‌బ్బుంద‌ని కొందరు, పద‌వి ఉంద‌ని కొంద‌రు మాట్లాడుతూ పోతుం టారు. అలా మాట్లాడ‌డం  త‌ప్పేం కాదు. మాట్లాడాలి కూడా! దేనికైనా ఒక విధానం ముఖ్యం అని అప్పుడెప్పుడో రావు రమేశ్ అనే క్యారెక్ట‌రు ఆర్టిస్టు చెప్పాడు. ఆ మాట ప్ర‌కారం మీరు కూడా విధానాలు మార్చాల..లేదా విధానాల‌ను స‌రిదిద్దేందుకు ఆలోచించి చూడాల?

మరింత సమాచారం తెలుసుకోండి: