ఆధునిక కాలంలోనూ మనుషులను మనుషులే చంపుకునే దారుణాలు ఇప్పుడు రష్యా కారణంగా జరుగుతున్నాయి. ఇక ప్రత్యేకించి మేరియుపోల్ నగరంలోనైతే.. యుద్ధం కారణంగా చనిపోయిన వారికి సామూహిక అంత్యక్రియలు నిర్వహిస్తున్న దృశ్యాలు చూస్తుంటే కడుపు తరుక్కపోతోంది. ఇంకా ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులతో విరుచుకు పడుతూనే ఉంది. ఈ యుద్ధంలో సామాన్య పౌరులను కూడా రష్యా విడిచి పెట్టడంలేదన్న విమర్శలు బాగా వస్తున్నాయి.
ప్రధాన నగరాలైన కీవ్, లెవివ్ వంటి చోట్ల రష్యా సైన్యం ఏకంగా నగరాల్లోకి నివాస గృహాలపైనే క్షిపణులు, బాంబులతో దాడులు చేస్తోంది. దీంతో మేరియుపోల్ పరిస్థితులు భయానకంగా ఉన్నాయి. అధికారికంగా చెప్పకపోయినా వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఒక్క మేరియపోల్‌లోనే 12 రోజుల్లో 1500లకు పైగా జనం చనిపోయారని ఉక్రెయిన్ మంత్రి దిమిత్రో కుబేలా చెబుతున్నారు.
ఇప్పుడు ఈ మేరియుపోల్ ఘటన ఈ భూమి మీదనే జరిగిన అత్యంత దారుణమైన మానవతా విపత్తు అంటోంది పశ్చిమ దేశాల మీడియా. రష్యాకు కొరకరాని కొయ్యగా మారిన ఉక్రెయిన్‌ను పుతిన్ సైన్యం నేరుగా ఎదుర్కోలేక నిరాయుధులపై బాంబులు వేస్తోందని ఆ దేశం ఆరోపిస్తోంది. వందల సంఖ్యల్లో మరణిస్తున్న పౌరుల అంత్యక్రియల కార్యక్రమాల్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు కూడా పాలు పంచుకుంటున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి