
దీంతో టీడీపీ నాయకులు ఊరూవాడా తిరుగుతూ.. ప్లకార్డులు పట్టుకుని మరీ.. జంగారెడ్డిగూడెం ఘటనపై కదం తొక్కారు.. దీంతో ఫుల్లు బిజీ అయిపోయారు. ఒకానొక దశలో నాయకులు కూడా చాలక.. ఇబ్బంది పడ్డారని గుసగుస వినిపించింది. ఇది ఇలా కొనసాగుతుండగానే.. తాజాగా జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఏపీ ఈఆర్సీ నివేదిక.. టీడీపీకి మరింతగా చేతి నిండా కల్పించింది. విద్యుత్ చార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ.. టీడీపీ నేతలు... రేపో మాపో.. వారం రోజుల ఉద్యమానికి రెడీ అవుతున్నారు.
నిజానికి కల్తీసారా మరణాలపై.. పది హేను రోజుల పాటు ఉద్యమం చేయాలని నిర్ణయించారు. దీనికి గురువారం ముహూర్తం కూడా పెట్టుకున్నారు. కానీ, ఇంతలోనే.. విద్యుత్ చార్జీల భారం అంశం తెరమీదికి రావడంతో .. ఇది మెజారిటీ ప్రజలకు సంబంధించిన అంశం అంటూ.. దీనిని పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే టీడీపీ ఎలా ఉద్యమం చేయాలి.. ఎలా ప్రజల్లోకి వెళ్లాలి.. అనే అంశాలపై రోడ్ మ్యాప్ రెడీ చేసుకుందని అంటున్నారు.
అంటే.. వచ్చే 10 రోజుల పాటు.. ఈ రేంజ్లో సీరియస్ ఇష్యూలు కనుక ఏమీలేక పోతే.. ఇదే విషయంపై టీడీపీ పోరాటాలు చేయనుంది. ఇలా.. ఏవిధంగా చూసుకున్నా.. జగన్ .. ప్రత్యర్థి పార్టీకి చేతినిండా పనికల్పించారని అంటున్నారు పరిశీలకులు. అయితే మరి వీటిని టీడీపీ ఎంత వరకు యూజ్ చేసుకుని మైలేజ్ పెంచుకుంటుంది ? అన్నది మాత్రం చూడాలి.