
ఎన్నికల ముందు సీపీఎస్ రద్దుపై మేం తొందరపడి హమీ ఇచ్చామని.. మేనిఫెస్టోలో పేర్కొన్న 95శాతం హామీలు నెరవేర్చామని చెప్పామని మంత్రి బొత్స గుర్తు చేశారు. తాము నెరవేర్చని 5శాతం హామీల్లో సీపీఎస్ రద్దు కూడా ఉందని ఇప్పటికే చెప్పామన్న మంత్రి బొత్స సత్యనారాణయ.. ఇంకా ఉద్యోగులు ఆందోళన కొనసాగిస్తే మేమేం చేయలేమని చెప్పేశారు. తమపై ఉన్న కేసులు ఎత్తివేయాలని ఉద్యోగులు కోరారని తెలిపిన మంత్రి బొత్స సత్య నారాయణ.. తీవ్రమైన కేసులు పెట్టిన వాటిపై సీఎం దగ్గరకు తీసుకెళ్లి చర్చిస్తామని తెలిపారు.
ఉద్యోగులపై పెట్టిన కఠిన కేసుల ఎత్తివేతపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఉద్యోగులతో చెప్పామని మంత్రి సత్య నారాయణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొత్స సత్య నారాయణ చర్చల గురించి మీడియాకు వివరించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నామన్న మంత్రి బొత్స సత్య నారాయణ.. ఉద్యోగుల కోసం సీపీఎస్ కంటే మెరుగైన స్కీమ్ తేవాలనే ఇప్పుడు జీపీఎస్‌ను తెచ్చామని అంటున్నారు. జీపీఎస్‌లో కూడా మెరుగైన సదుపాయాలు పెంచుతున్నట్లు ఉద్యోగులతో చెప్పామని.. వారిని ఒప్పిస్తామని మంత్రి సత్య నారాయణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొత్స సత్య నారాయణ అన్నారు. ప్రతి ఉద్యోగి రిటైర్ అయ్యాక కనీసం రూ.10వేలు పింఛను వచ్చేలా చర్యలు తీసుకుంటామని ఉద్యోగులకు వివరించామని.. ఉద్యోగి, భాగస్వామికి ప్రమాద బీమా, హెల్త్ కార్డు సదుపాయాలు కూడా కల్పిస్తామని.. ఉద్యోగి చనిపోయినా స్పౌజ్‌కు పింఛను సదుపాయం ఇస్తామని ఉద్యోగులతో చెప్పామని మంత్రి బొత్స వివరించారు.