
ఒకప్పుడు డిగ్రీ చదివే సమయంలో ఎంత పెద్ద లెక్కైనా నోటితోనే వేయాల్సి వచ్చేది. క్యాలిక్యులేటర్ని వాడనిచ్చేవారు కాదు. ఆ తర్వాత తర్వాత క్యాలిక్యులేటర్లు నెమ్మదిగా వచ్చాయి. దాంతో మనుషులు అప్పటివరకు వాడిన తమ బ్రెయిన్స్ ని ఈ క్యాలిక్యులేటర్ రాకతో, లెక్కల కోసం వాడడం మానేశారు. ఇప్పటికాలంలో క్యాలిక్యులేటర్లు కామన్ అయిపోయాయి. ఇప్పటి పిల్లలకైతే చేతిలెక్కలు, నోటి లెక్కలు తెలియడం లేదు.
ఇప్పుడు కొత్తగా పిల్లల్ని ఇంకా బద్ధకస్తుల్ని చేయడానికి చాట్ జిపిటి అనే కొత్త టెక్నాలజీ వస్తుంది. ఈ చాట్ జిపిటి తనకు తాను గానే కవితలు, కెమికల్ రికార్డ్స్ కూడా రాసిస్తుందంట. పర్సనలైసెడ్ మెసేజెస్ కూడా చేసిస్తుందంట. ఫిల్మ్ స్క్రిప్ట్స్ ఇంకా అసైన్మెంట్స్ కూడా రాసిస్తుందంట. ఇప్పటికే అమెజాన్, వాట్సప్, ఇంటర్ నెట్ లాంటి వాటితో మనం సగం బుర్రను వాడడం మానేశాం.
భవిష్యత్తులో ఈ చాట్ జిపిటి తో ప్రేమలేఖలు కూడా వ్రాయించేసుకుంటారు యువత. ఇప్పటికే పిల్లలు చాట్ జిపిటితో హోం వర్క్ లు కూడా చేయించేసుకుంటున్నారట. ఇప్పటికే పెరుగుతున్న సౌకర్యాలతో బద్ధకస్తులై పోతున్న జనాలు ఈ చాట్ జిపిటి దెబ్బకి తమ మెదడును పూర్తిగా వాడటం మానేస్తారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది భవిష్యత్తు తరాలపై చాలా కీలకమైన ప్రభావాన్ని చూపించే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది మరి.