
ఇప్పటి వరకూ సుమారుగా 2.75 లక్షల ఇళ్లను పూర్తిచేశామని సీఎం జగన్కు అధికారులు తెలిపారు. అంతే కాదు.. మరో 74వేల ఇళ్లలో శ్లాబు,మరో 79 వేల ఇళ్లు రూఫ్ లెవల్లో ఉన్నాయని అధికారులు తెలిపారు. మార్చి నాటికి సుమారు 5 లక్షల ఇళ్లు పూర్తిచేసే దిశగా పనులు జరుగుతున్నాయని అధికారులు సీఎం జగన్కు వివరించతారు. అంటే మార్చి నాటికి జగన్ సర్కారు 5 లక్షల మందికి సొంత ఇంటి కల నెరవేర్చినట్టు అవుతుంది.
లే అవుట్లు పూర్తవుతున్న కొద్దీ మౌలిక సదుపాయాలను ప్రాధాన్యతా క్రమంలో ఏర్పాటు చేసుకుంటూ ముందుకుసాగాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. అయితే.. కోర్టు కేసుల కారణంగా ప్రకాశం, అనంతపురం జిల్లాల్లోని 2 లే అవుట్లకు బదులుగా ప్రత్యామ్నాయ భూములను ఎంపిక చేశామని అధికారులు సీఎం జగన్కు తెలిపారు. సుమారు 30 వేలమందికి ఇళ్లనిర్మాణం కోర్టుకేసుల కారణంగా జాప్యం జరిగిందని అధికారులు సీఎం జగన్కు వివరించారు.
అయితే.. వీరికి త్వరలోనే పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు సీఎం జగన్కు వెల్లడించారు. దీని కోసం అవసరమైన భూ సేకరణకోసం అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఏదేమైనా సీఎం జగన్ సర్కారు చేపట్టిన సొంతింటి కల నిర్మాణం ఓ రికార్డు అనే చెప్పుకోవచ్చు. 5 లక్షల మందికి సొంత ఇళ్లు నిర్మించి ఇవ్వడం అనేది సామాన్య విషయం కానే కాదు. ఏకంగా ఊళ్లనే నిర్మించిన సీఎంగా జగన్ చరిత్రలో నిలుస్తారంటున్నారు నిరుపేదలు.