పాలనా సంస్కరణ సీఎం జగన్ కు చేతకాదని టీడీపీ అనుకూల మీడియాతో పాటు కొన్ని మీడియా సంస్థలు కావాలనే విషం చిమ్మే వార్తలు రాస్తున్నట్లు వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. కానీ జగన్ ప్రవేశ పెట్టిన పథకాల గురించి మాత్రం వార్తలు రాయరని చెప్పుకొచ్చారు. ఇంటి దగ్గరకే వాలంటీర్ సేవలతో ప్రతి ఇంటికి పథకాల ను తీసుకొచ్చి మరీ ఇస్తున్నారు. ఇది పాలనా సంస్కరణ కాదని టీడీపీ ఆరోపించడం విచిత్రంగా అనిపిస్తోందని వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.  


అయితే చంద్రబాబు హయాంలో తెలంగాణాలో లేని పథకం. ఆంధ్రప్రదేశ్ లో తీసుకొచ్చిన సంస్కరణ ఏదైనా వెహికల్ కొనుక్కుంటే ఆ కొనుక్కున్న షాపులోనే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. దీని కోసం ఆర్టీఏ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పని లేదు.  ఎవరికి లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా చేశారు.  కేవలం డ్రైవింగ్ లైెసెన్సు,కమర్షియల్ వెహికల్స్ రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలోనే ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లాలి.


ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఒక మంచి పథకాన్ని సీఎం జగన్ ప్రవేశపెట్టారు. అదే రిజిస్ట్రేషన్ సేవలను సులభతరం చేయడం. గతంలో రిజిస్ట్రేషన్ల కోసం స్టాంపులు కొనాలి. కొంతమంది  అవి దొరకకుండా చేసి బ్లాక్ లో ఎక్కువ ధరకు అమ్మేవారు. అవినీతి ఎక్కడా జరగకుండా రిజిస్ట్రేషన్ సులభతర సేవల కోసం ఈ స్టాంపింగ్  విధానాన్ని సీఎం జగన్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు.


దీని కోసం డబ్య్లూ డబ్య్లూ డబ్య్లూ . ఈ స్లాంపింగ్ డాట్. కామ్ ద్వారా ఆన్లైన్ లో ఈ స్టాంపులు తీసుకోవచ్చు. నగదు లేకుండా ఆన్ లైన్ ద్వారానే నెప్ట్, యూపీఐ, తదితర పద్ధతుల ద్వారా సులభంగా డబ్బులు పే చేసేయొచ్చు.  ఎంపిక చేసిన ఎస్ బీఐ, అప్కాబ్, యూనియన్ బ్యాంకుల ద్వారా పేమెంట్ చేయొచ్చు. మొత్తం 1430 కేంద్రాల ద్వారా ఈ స్టాంపిగ్ ప్రక్రియను సులభంగా పూర్తి చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: