
కాంగ్రెస్ పార్టీలోనే 100 గ్రూపులు, ఆ గ్రూపుల మధ్య ఎన్నో లొసుగులు కూడా ఉంటాయి. వాటిని వదిలేసి భారతీయ జనతా పార్టీ మీదే కాన్సన్ట్రేషన్ చేయడం, దాన్ని టార్గెట్ చేయడం వెనక ఒక లెక్క ఉందని తెలుస్తుంది. వాళ్ల పార్టీలోని లొసుగులు పక్కనపెట్టి బిజెపిని టార్గెట్ చేస్తే అందరూ కాంగ్రెస్ లోపల జరిగే దాన్ని గమనించరని ఆయన లెక్క అంటున్నారు కొంతమంది. ఇది ఒక డైవర్షన్ గేమ్ లో ఒక పార్ట్ అని అంటున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంకా ఈటెల రాజేందర్. ఒకళ్ళు టిఆర్ఎస్ నుండి వస్తే, మరొకళ్ళు కాంగ్రెస్ నుండి బిజెపిలోకి వచ్చారు. వీళ్ళిద్దరిపై ఒక కథనాన్ని ప్రాజెక్ట్ చేసుకుంటూ వచ్చారు సోషల్ మీడియాలోనూ ఇంకా పత్రికల్లో కూడా. రాజగోపాల్ రెడ్డి వచ్చేస్తానని అంటున్నారని అయితే దానికి ఈటెల రాజేందర్ బతిమాలుతున్నారని చెప్పుకొస్తున్నారు. బిసి ఎజెండా పెట్టబోతున్న నేపథ్యంలో బయటకు వచ్చేస్తున్నట్లుగా అంటున్నారు వాళ్ళు.
అయితే ఈ వార్తలకు వాళ్లంతట వాళ్ళే బయటకు వచ్చి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్లో 100 గొడవలు ఉన్నాయని, అక్కడ ఏ బీసీలకు న్యాయం జరగదని ఆయన అన్నారు. నేను బిజెపి లోనే ఉంటాను నామీద అనవసర ప్రోపగాండా సృష్టిస్తున్నారని ఈటెల రాజేందర్ అన్నట్లుగా తెలుస్తుంది. బిజెపిలో ఉన్నటువంటి కొంతమంది వాళ్లను ట్రోల్ చేయడం, వాళ్ళిద్దరూ బాధపడడం ఇవన్నీ రేవంత్ రెడ్డి ఎత్తుగడల్లో ఒక భాగమే అంటున్నారు.