ఆంధ్రప్రదేశ్ లో నాడు నేడు తో స్కూళ్లు బాగు పడుతున్నాయి. ట్యాబ్ మేళా అని హెడ్డింగ్ తో వార్తను ప్రచురించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థికి ట్యాబ్ ఇచ్చి అతడి చదువుకు ఉపయోగించుకునేలా చేస్తుంటే దాన్ని హేళన చేస్తూ వార్తలు రాస్తుంది.
బైజుస్ కంటెంట్ తో విద్యార్థులు ట్యాబ్ ల్లో చదువుకోవడం వల్ల వారు మెరుగ్గా రాణించే అవకాశం ఉంది. సామాజిక ప్రయోజనంతో కూడుకున్న పథకం ఇది.
అయితే.. ఒకటి కాదు రెండు కాదు 5 లక్షల ట్యాబ్ లు ఇస్తుంటే దాన్ని తట్టుకోలేక ఎల్లో మీడియా తెగ ఆడిపోసుకుంటుంది. అదే చంద్రబాబు హయాంలో ట్యాబ్ లు ఇచ్చి ఉంటే మాత్రం దాన్ని కచ్చితంగా మెచ్చుకుంటారు. ప్రపంచం మొత్తం అడ్వాన్స్ అయిపోతుంది. పిల్లలు కూడా ఇంటర్ వచ్చే సరికి వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. టెక్నికల్ నాలెడ్జ్ అవసరమవుతుంది. ఇలా అనేక రకాలుగా ప్రజల మైండ్లలోకి ప్రచారాన్ని ఎక్కించేందుకు ప్రయత్నిస్తారు.
కానీ వైసీపీ ప్రభుత్వం ఇలా ఏదైనా మంచి చేయాలని చూస్తుంటే మాత్రం దాని వెనక తప్పును చూపాలని ఆంధ్రజ్యోతి ప్రయత్నిస్తోందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు అవసరమయ్యే అన్ని పనులు చేస్తున్నా ఏ ప్రభుత్వన్నైనా ప్రశంసించాలి. చంద్రబాబు చేస్తే ఆహా ఎంత గొప్ప పని అనడం.. జగన్ చేస్తే తప్పులు వెతకడం మానుకోవాలి. రాష్ట్రంలోని విద్యార్థులకు ట్యాబ్ లు ఇవ్వడం మంచి పనే దీన్ని కూడా తప్పు పడుతూ రాయడం అవివేకమే అవుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి