స్కిల్ డెవలప్ మెంట్ కేసులో విచిత్రమైన వాదనలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు దగ్గరకు వెళ్లి మూడు విభాగాల్లో పదవులు పొంది ప్రపొజల్ పెట్టి వేరే డిపార్ట్ మెంట్ లో డబ్బులు రిలీజ్ చేసుకుని వాటిని మరో డిపార్ట్ మెంట్  తీసుకున్న గంటా మంచి వారే అయిపోయారు. అదే సందర్భంలో ఈ వ్యవహారంలో అతనికి సహకరించిన అందరూ మంచి వారుగానే పేరు పొందుతున్నారు.


సంతకం పెట్టిన పీవీ రమేశ్ సీఎం చీప్ సెక్రటరీగా ఉన్నది కూడా తప్పుకాదు. అయితే ఆ డబ్బులు వెళ్లిపోయాక స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు ఫెయిల్ అయ్యాక దాన్ని పర్యవేక్షించనటువంటి అజయ్ కల్లం రెడ్డిని, ప్రేమ్ చంద్ రెడ్డి ని ఎందుకు జైల్లో వేయడం లేదు. దీనికి కారణాలు కూడా ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదు. ఇంకో విషయం డబ్బులు రిలీజ్ చేసిన నీలం సాహ్నిని ఎందుకు అరెస్టు చేయరు.


తప్పు చేసేది ఒకరైతే శిక్ష పడాల్సింది అధికారులకా అని అనుకుంటున్నారు. ఇలాంటి విషయాల్లో జగన్ కాస్త బెటర్ అని చెప్పుకోవచ్చు. జగన్ కేసుల్లో అధికారుల మీద నెపం నెట్టకుండా డైరెక్టుగా అసలు కుంభకోణాలు జరగలేదని వాదించుకు వచ్చారు. ప్రభుత్వం తప్పు చేయలేదు. అధికారులు తప్పు చేయలేదు. అని వాదిస్తున్నారు.


చంద్రబాబు కేసు విషయంలో మాత్రం ఆయన తప్పు చేయలేదు. కానీ కింద స్థాయి అధికారులు మాత్రం తప్పు చేశారని చెబుతున్నారు. ఇదెక్కడి అన్యాయం అని చాలా మంది అధికారులు వాపోతున్నట్లు తెలుస్తోంది. తన కింద వాళ్లు తప్పు చేస్తే చర్యలు తీసుకోవాల్సిన చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదు. మనీ ల్యాండరింగ్ విషయంలో చంద్రబాబు తప్పు చేశారని కేసు వేశారు. అయితే ఇందులో అధికారులు తప్పు చేశారని చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడం లో ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదంటున్నారు విశ్లేషకులు. తప్పులు చేసి అధికారుల మీద నెపాన్ని నెట్టి తప్పించుకోవాలని చూస్తున్న చంద్రబాబుపై అధికారులు గుస్సా మీద ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: