జగన్ ను సైకో అని, ఉన్మాది అని ఏదో పేర్లతో పిలుస్తూ ఇష్టారీతిన మాట్లాడారు చంద్రబాబు నాయుడు అండ్ టీడీపీ నాయకులు. లోకేశ్ కూడా జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. అయితే ఇన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న వైసీపీ అధినేత రివేంజ్ తీసుకునే పనిలో పడ్డాడు. రాబోయే ఎనిమిది నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఎన్నికలకు వెళ్లే ముందే చంద్రబాబు అండ్ టీం పై కక్ష సాధింపు చర్యలు చేపట్టాలని నిర్ణయించుకున్నారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతోనే ఇన్ని రోజులుగా లేని కేసులు ఇప్పుడు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శిస్తున్నారు.



ప్రస్తుతం చంద్రబాబు నాయుడిపై 370 కోట్ల అవినీతి చేశాడని సీబీఐ కేసు పెట్టడంతో ప్రస్తుతం ఆయన జైలులో ఉన్నారు. అదే విధంగా ఆయనపై మరిన్ని కేసులు పెడుతూ కక్ష సాధిస్తున్నారని అంటున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ నెట్ కేసులో కూడా చంద్రబాబును ఇరికించారని టీడీపీ నేతలు వాపోతున్నారు. ఇలా చేయడం సరికాదని వాదిస్తున్నారు. జగన్ ను గతంలో అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లాడు. కాబట్టే దానికి ప్రతీకారంగా ఇలా కేసుల మీద కేసులు వేస్తూ చంద్రబాబును బయటకు రాకుండా చేస్తున్నాడని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది.



చంద్రబాబుకు బెయిల్ ఇప్పించేందుకు ఎంతగా ట్రై చేస్తున్న ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద లాయర్లు వచ్చినా కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఒక కేసు అయిపోగానే మరో కేసు పెట్టి కక్ష సాధిస్తున్నారు. ఇలా చేయడం వల్ల చంద్రబాబు మరికొన్ని రోజులు జైల్లో ఉంటారేమో కానీ ఆయన్ని ఏమీ చేయలేరని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. ఆయన వయసు రీత్యా అయినా జైలు నుంచి విడుదల చేయాలని కోరుతున్నారు. అయితే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేశ్ ను కూడా అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: