నాడు నేడు  పథకంలో సర్వ శిక్షా అభియాన్ కింద కేంద్రం నుంచి ఎక్కువ నిధులు వస్తున్నాయి. కానీ ఈ పథకానికి ఎక్కువగా జగన్ మాత్రమే ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఆయుష్మాన్ భారత్ కు సంబంధించిన కొన్ని నిధులను ఆరోగ్య శ్రీకి వాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే నిధులు ఇస్తున్నట్లు చెప్పుకుంటున్న విధానంపై కేంద్రం ఏపీ సర్కారుపై గుర్రుగా ఉంది. ఇది వరకు కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను ఒక్కో పథకంలోనివి మరో పథకంలోకి మార్పిడి చేసుకుని వాడుకునే వారు. అప్పుడు కేంద్రం నుంచి ఎక్కడా కూడా అలా ఎలా వాడారని అడిగిన సందర్భాలు కూడా తక్కువే.


దీంతో ఏ పథకాల్లో డబ్బులు తక్కువగా ఉంటే అందులోకి మరో పథకంలోని కేంద్రం నిధులను వాడుకుని పనులు చేయించుకునే వారు. లేదా రెగ్యులర్ అవసరాలకు వాడుకునేవారు. కానీ కేంద్రం మాత్రం ఇప్పుడు కండిషన్ పెట్టింది. కేంద్రం దేనికి ఏ పథకానికి ఇస్తుందో దానికే ఆ నిధులను వాడాలని ఆదేశించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చే ఇండ్లకు జగనన్న ఇండ్లు అని పెట్టుకున్నారు.


వైఎస్సార్ హాస్పిటల్ అని ఆయుష్మాన్ భారత్ కింద ఇచ్చే హాస్పిటల్ కు పేరు పెట్టాలనుకున్నారు. అయితే ఇలా కేంద్రం ఇచ్చే నిధులతో పెట్టుకునే వాటికి ఏపీలో జగన్ తన పథకాలుగా పేర్లు మార్చుకుంటున్న విధానంపై కేంద్రం సీరియస్ గా స్పందించింది. ఈ మేరకు రాష్ట్రాలకు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం నోటీసులు పంపించింది.


హెల్త్ సెంటర్లకు సంబంధించి పేర్లు ఆయుష్మాన్ భారత్ మందిర్ అని పేరు రాయాలని, ట్యాగ్ లైన్ ఆరోగ్యమే మహాభాగ్యం అని పెట్టాలని సూచించారు. అయితే దీన్ని ఎంత మేరకు ఏపీలో పెడతారో చూడాలి. ఎక్కడెక్కడ పేర్లు మార్చలేదో.. మార్చిన తర్వాత కూడా వాటిని తీసేసి మళ్లీ వైఎస్సాఆర్ ఆసుపత్రి అని మార్చుకున్నారో వాటిని గమనించాల్సిన అవసరం ఉంది.  కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: