తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయాయి.  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.  ఇక ఆంధ్రాలో కొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇదే తరుణంలో అక్కడి రాజకీయాలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి.  అధికారంలో ఉన్న వైసీపీ తిరిగి కుర్చే చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.


మరోవైపు ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ విశ్వ  ప్రయత్నాలు చేస్తోంది.  అయితే ఏపీ రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. తెలంగాణ మాదిరి రాజకీయాలు ఇక్కడ కనిపించవు. పేరుకు తెలుగు రాష్ట్రాలైన అక్కడి వాతావరణం.. రాజకీయాలు పూర్తిగా వేరు.  ఏపీలో కుల రాజకీయాలు ఎక్కువగా ఉంటే.. తెలంగాణలో సెంటిమెంట్ రాజకీయాలు నడుస్తూ ఉంటాయి.  ఈ సారి జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్తున్న టీడీపీకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.  


ఎలా అంటే ఈసారి ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ పోటీ చేయనుంది. ఆ పార్టీ గుర్తు కూడా సైకిల్ కావడం విశేషం.  ఎన్టీఆర్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి సైకిల్ అంటే టీడీపీ… టీడీపీ అంటే సైకిల్ అనే భావన ప్రతి తెలుగువారిలో స్థిరపడిపోయింది.  అయితే సమాజ్ వాదీ పార్టీ గతంలో జాతీయ స్థాయి పార్టీ ప్రస్తుతం కాదు అనే విషయాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు.


గతంలో ఎన్నికల సంఘం ప్రకటించేనాటికి దేశంలో మొత్తం ఆరు జాతీయ పార్టీలు మాత్రమే ఉన్నాయి. అవి బీజేపీ, కాంగ్రెస్, party OF INDIA' target='_blank' title='కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ ,  బహుజన్ సమాజ్ పార్టీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ లు ఉన్నాయి. ఈ లిస్టులో సమాజ్ వాదీ పార్టీ లేదు. ఈ నేపథ్యంలో ఎస్పీ ఒకవేశ ఏపీలో పోటీ చేసినా.. టీడీపీకే సైకిల్ గుర్తు దక్కుతుంది. కారణం సమాజ్ వాదీ పార్టీకి ఏపీలో గుర్తింపు లేదు. గతంలో డీకే అరుణ ఎస్పీ తరఫున పోటీ చేసినా.. ఆమెకు సైకిల్ గుర్తు దక్కలేదు. కొబ్బరి కాయ గుర్తు లభించింది. ఈ లెక్కన టీడీపీ సైకిల్ గుర్తుకు ఎలాంటి ఇబ్బంది లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: