
దీనిపైనే తాజాగా కేంద్ర బీజేపీ నుంచి రాష్ట్రానికి సమాచారం అందింది. దేశవ్యాప్తంగా మోడీ మేనియా పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నట్టు తెలిపారు. ఈ నేపథ్యంలో మోడీ హయాం లో జరిగిన అభివృద్దికార్యక్రమాలు, అందుతున్న నిధులపై గ్రామ గ్రామాన ప్రచారం చేయాలని ఆదేశిం చారు. త్వరలోనే ఏర్పాటు చేయనున్న బీజేపీ-మోడీ-మేనియా సోషల్ మీడియా సైట్‌లో ఈ కార్యక్రమాల కు సంబంధించిన వీడియోలను అప్ లోడ్ చేయాలని సూచించారు.
ఏదో కార్యక్రమాలు చేశామంటే చేశామని కాకుండా.. మొక్కుబడిగా కాకుండా మనసు పెట్టి చేయాలని కూడా పార్టీకి ఆదేశాలు అందాయి. ఈ కార్యక్రమాల నిర్వహణ పూర్తి బాధ్యతను రాష్ట్ర చీఫ్ పురందేశ్వరి దేనని కూడా.. పేర్కొన్నారు. వాస్తవానికి ఇలాంటి ఆదేశాలు ఒక్క ఏపీ బీజేపీకి మాత్రమే కాదు.. దేశవ్యాప్తం గా అన్ని రాష్ట్రాల బీజేపీ చీఫ్‌లకు అందాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న చోట, కూటమిగా ఏర్పడి అధికారం పంచుకున్న చోట దూకుడు ప్రదర్శించాలని కూడా పేర్కొన్నారు.
ఇప్పటి వరకు ఏపీలో పది మాసాలైనా.. ఇలాంటి కార్యక్రమాలు అయితే.. నిర్వహించలేదు. ఎక్కడా కూడా .. ఎవరినీ కలవలేదు. గ్రామీణ స్థాయిలో ఓటు బ్యాంకును పెంచుకునే దిశగా కూడా అడుగులు వేయలేదు. అంతేకాదు.. ఎవరికి వారుగానేఉన్నారు. ఎవరికి వారే రాజులుగా.. మంత్రులుగా రాష్ట్ర బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు వీరంతా కలసి కట్టుగా ముందుకు కదిలి.. పార్టీ కోసం పనిచేయాలని.. మోడీ మేనియాను తగ్గకుండా చూసుకోవాలని పార్టీ ఆదేశించింది. దీంతో చిన్నమ్మ ఇకపై బిజీ కానున్నారు.