- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ )

తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో కనిపించ‌ని రాజకీయం ఇంకా జరుగుతుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. హరీష్ రావు - సంతోష్ రావు పై ఆరోపణలు చేశారన్న అంశంపై కెసిఆర్ తన కుమార్తె కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. కవిత కూడా తనను సస్పెన్షన్ చేయటం పట్ల పెద్దగా బాధపడినట్టు లేదు. తన రాజకీయం తాను చేసుకునే పనిలో కవిత బిజీగా ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మర‌క పడింది హరీష్ రావు మీద.. ఆయనపై చేసిన ఆరోపణలు ఇప్పటి వరకు కేటీఆర్ కూడా ఖండించలేదు. ఏదో చిన్నగా సోషల్ మీడియాలో ఒక కామెంట్ తో సరిపెట్టేశారు. కవిత - హరీష్ రావుపై తప్పుడు ఆరోపణలు చేసిందని ప్రకటించి చేతులు దులుపుకున్న వాతావరణం కనిపిస్తోంది. అయితే హరీష్ రావు పై సోషల్ మీడియాలో విస్తృతంగా ఆరోపణల పరంపర సాగుతోంది.


ఆయన కేసీఆర్ వద్దకు వచ్చేటప్పుడు రబ్బరు చెప్పులతో వచ్చారని .. ఇప్పుడు ఏ వ్యాపారం చేయకుండా వందల కోట్లు ఎలా సంపాదించారో ? చెప్పాలని డిమాండ్లు వస్తున్నాయి. కవిత మద్దతు దారులు మాత్రమే కాదు .. కాంగ్రెస్ వాళ్లు కూడా ఈ డిమాండ్ను లేవనెత్తుతున్నారు. అయితే కవిత ఆరోపణలపై బిఆర్ఎస్ ముఖ్య నేతలు అందరూ సైలెంట్ గా ఉండడంతో ఈ డిమాండ్లు ఇంకా ఎక్కువగా వినిపిస్తున్నాయి. హరీష్ రావు నిజాయితీపరుడని.. కాలేశ్వరంలో అవినీతి చేశాడని నమ్మటం లేదని.. బిఆర్ఎస్ ముఖ్య నేతల నుంచి ఒక్క ప్రకటన కూడా వచ్చిన దాఖలాలు లేవు.


అయితే హరీష్ విషయంలో బిఆర్ఎస్‌కు పూర్తి స్పష్టత ఉందని హరీష్ రావు పై కవిత ఆరోపణలు చేయడం వల్లే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని.. అదే హరీష్ రావుకు కేసిఆర్ కేటీఆర్ ఇచ్చిన సపోర్ట్ అని కొందరు అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఏదో తూతూ మంత్రంగా హరీష్ రావుకు మద్దతు ఇస్తున్నా.. భవిష్యత్తులో ఆయనకు గడ్డు పరిస్థితి తప్పదని ఎక్కువ మంది అంచనా వేస్తున్నారు. కేటీఆర్ పార్టీపై పూర్తి పెత్తనం ఇస్తార‌ని.. అప్పుడు హరీష్ రావుకు ఉండే బాధ్యతలు తగ్గిపోతాయంటున్నారు. చివరకు ఆయనను సిద్ధిపేట లేదా మెదక్ జిల్లాకు పరిమితం చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని బిఆర్ఎస్ వర్గాల్లో కూడా చర్చలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: