వైసిపి మాజీమంత్రి విడుదల రజనీకి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అదిరిపోయే షాక్ ఇచ్చారని రజిని అభిమానులు హార్ట్ అవుతున్న పరిస్థితి పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కనిపిస్తోంది. ప్రస్తుతం చిలకలూరిపేట ఇన్చార్జిగా ఉండగా . . ఆమె త్వరలో వైసిపి ఇన్చార్జిగా రేపల్లెకు బదిలీ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆమెకు ఈ విషయమే సమాచారం ఇచ్చారని చిలకలూరిపేట లో కార్యక్రమాలు తగ్గించుకోవాలని రేపల్లె వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని కూడా పార్టీ అధినేత దూతల ద్వారా రజనీకి సమాచారం అందిందని ప్రచారం జరుగుతోంది. దీంతో విడుదల రజని షాక్ కావడంతో పాటు తీవ్ర అసంతృప్తి గురయ్యారని చిలకలూరిపేటలో ఆమె అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. 2019లో చిలకలూరిపేటలో వైసీపీ ఎమ్మెల్యేగా రజిని గెలిచారు. తర్వాత మూడేళ్లకు జగన్ ప్రభుత్వంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి అయ్యారు.
గత ఎన్నికలకు ముందు ఆమెకు స్థానికంగా తీవ్రమైన వ్యతిరేకత కనిపించడంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి మార్చారు. అక్కడ ఆమె 53, 000 ఓట్ల తేడాతో గల్లా మాధవి చేతిలో ఓడిపోయారు. ప్రస్తుతం రేపల్లె వైసిపి ఇన్చార్జి గా ఈపూర్ గణేష్ ఉన్నారు. డాక్టర్ గా ఉన్న ఆయన ఏమాత్రం యాక్టివ్గా లేరు. దీంతో రేపల్లెలో వైసీపీకి నాయకత్వం లేని దుస్థితి. మాజీ మంత్రి మోపిదేవి టిడిపిలో చేరిపోయారు. ఈ క్రమంలోనే తెలంగాణ ముదిరాజ్ వర్గానికి చెందిన రజినీని బీసీ కోటాలో రేపల్లెలో పోటీ చేయించాలని వైసీపీ ఎనలిస్టులు తేల్చినట్టు సమాచారం. ఏది ఏమైనా రజిని చిలకలూరిపేట నుంచి రేపల్లెకు బదిలీపై వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది ఆమె కు ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితి. చివరకు ఎన్నికల నాటికి జగన్ రజనీకి సీటు లేకుండా హ్యాండ్ ఇచ్చినా ఆశ్చర్య పోనక్కర్లేదన్న సందేహాలు కూడా రజనీ ఫ్యాన్స్‌లో ఉన్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి