పట్టణ ప్రాంతాల్లో అనధికార నిర్మాణాలను క్రమబద్దీకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బిల్డింగ్ పీనలైజేషన్ స్కీం (బీపీఎస్) ద్వారా 2025 ఆగస్టు 31 లోపు నిర్మించిన ఇళ్లు, భవనాలను చట్టబద్ధం చేసుకునే అవకాశం కల్పించింది. ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాభివృద్ధి సంస్థలు, పురపాలక సంస్థలు, నగరపాలక సంస్థలలో అమలవుతుంది. దాదాపు 59,041 అనధికార నిర్మాణాలు ఈ పథకం ద్వారా క్రమబద్ధమయ్యే అవకాశం ఉంది.

ఆన్‌లైన్‌లో www.bps.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా ప్రకటన వెలువడిన 120 రోజుల్లో దరఖాస్తులు సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. కేటగిరీల వారీగా పీనలైజేషన్ ఫీజులను నిర్ణయించి, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భూమి ధరల ఆధారంగా వసూలు చేయనున్నారు. ఈ పథకం ద్వారా వచ్చే ఆదాయాన్ని పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి వినియోగించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే, రాజధాని అమరావతిలోని కోర్ క్యాపిటల్ ప్రాంతంలో ఈ పథకం వర్తించదని స్పష్టం చేసింది.

ప్రజలకు సులభంగా అవగాహన కల్పించేందుకు మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.ఈ పథకం అన్ని నిర్మాణాలకు వర్తించదు. ప్రభుత్వ భూములు, వివాదాస్పద భూములు, యాజమాన్య హక్కు లేని భూములపై నిర్మాణాలు ఈ పథకం పరిధిలోకి రావు. అలాగే, అర్బన్ ల్యాండ్ సీలింగ్ నిబంధనలు, చెరువులు, వాగులు, కాలువలు ఆక్రమించి నిర్మించిన భవనాలు కూడా అనర్హమని ప్రభుత్వం వెల్లడించింది.

తీర ప్రాంత నియంత్రణ మండలి (సీఆర్‌జడ్) నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు, అనుమతించిన లేఔట్‌లలో పార్కింగ్, ఓపెన్ స్పేస్‌లలో నిర్మాణాలు కూడా ఈ పథకం నుంచి మినహాయించబడ్డాయి.2025 ఆగస్టు 13 తర్వాత నిర్మించిన భవనాలకు ఈ క్రమబద్దీకరణ వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం పట్టణ ప్రాంతాల్లో చట్టబద్ధతను పెంచి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరింది.


వాట్సాప్ నెంబ‌ర్‌ 94905 20108 కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు



మరింత సమాచారం తెలుసుకోండి: