కరోనా ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని వచ్చే నెలలో తలపెట్టిన జేఈఈ మెయిన్‌, నీట్‌ యూజీ పరీక్షలను వాయిదా వేయాలని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు, సామాజిక ఉద్యమకారులు చేసిన విజ్ఞప్తిని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ), కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఇదివరకు నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమే సెప్టెంబర్‌ 1-6 తేదీల మధ్యలో జేఈఈ మెయిన్‌, సెప్టెంబర్‌ 13న నీట్‌ యూజీ పరీక్షలు జరుగుతాయని స్పష్టం చేసింది.

నీట్‌, జేఈఈ పరీక్షలను నిర్వహించాలని విద్యార్థుల తలిదండ్రులు, విద్యార్థులు కూడా కోరుతున్నారని విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిషాంక్ తెలిపారు. ఇప్పటికే 80 శాతం మంది స్టూడెంట్స్ జేఈఈ ఎగ్జామ్స్ కోసం అప్పుడే అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకున్నారని చెప్పారు.

జేఈఈ కోసం రిజిస్టర్ చేసుకున్న 8.5 లక్షల మంది విద్యార్థుల్లో 7.25 లక్షలమంది అడ్మిట్ కార్డులను డౌన్ లోడ్ చేసుకోవడం చూస్తే, వారి ఆసక్తి ఎంతగా ఉందో అర్థమవుతోందని రమేష్ పోఖ్రియాల్ అన్నారు. మాకు విద్యార్థుల భవిష్యత్తు ముఖ్యం అని పేర్కొన్నారు. స్కూళ్లను మళ్ళీ ప్రారంభించే విషయమై.. హోమ్, ఆరోగ్య మంత్రిత్వ శాఖల గైడ్ లైన్స్ ప్రకారం తాము నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

జేఈఈ మెయిన్‌స్, నీట్  నిర్వహణకు కరోనా వైరస్ కారణంగా ఈ  నేపథ్యంలో ఈ సారి పలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.జేఈఈ మెయిన్స్  2020, నీట్  నిర్వాహకులు. దేశవ్యాప్తంగా సెప్టెంబరు 1 నుంచి 6 వరకు జరగనున్న జేఈఈ మెయిన్స్, అలాగే సెప్టెంబర్ 13న జరిగే నీట్ యూజీ పరీక్షల నిర్వహణకు కోవిడ్‌ 19 నేపథ్యంలో ఈ సారి పలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.కరోనా కారణంగా పరీక్షా కేంద్రాల వద్ద ప్రతి ఒక్క అభ్యర్థికీ థర్మల్‌ స్క్రీనింగ్‌ టెస్ట్ చేస్తారు. మొదటిసారి ఉష్ణోగ్రత 99.4 డిగ్రీలు దాటితే వారిని కొద్దిసేపు పక్కన ఉంచి... మళ్లీ ఉష్ణోగ్రత చూస్తారు. అప్పటికీ వారి పరిస్థితి అదే విధంగా ఉంటే ఐసొలేషన్‌ కేంద్రంలో పరీక్ష రాయిస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: