
నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగం ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ నోటిఫికేషన్ ఎవరైతే ఐటిఐ కంప్లీట్ చేసుకున్నారు వారికి మాత్రమే ఈ సువర్ణావకాశం.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నం లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ నోటిఫికేషన్ జారీ చేసి నిరుద్యోగులకు ఊరటనిచ్చింది.BEL సంస్థ ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ చేసి, త్వరలోనే నియామకాలు చేపట్టడానికి సిద్ధంగా ఉంది.సదరు ఐటిఐ ముగించుకున్న విద్యార్థులు ఈ సంస్థలో ఉద్యోగం చేయడం కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరుకావాల్సిందిగా సంస్థ ప్రకటించింది.
ఈ సంస్థలో ఎంపికైన నిరుద్యోగులకు ఒక సంవత్సరంపాటు అప్రెంటిస్ ట్రైనింగ్ ఇవ్వనుండగా,రూ.8050 రూపాయలను స్టైఫండ్ కింద ఇవ్వనున్నట్లు సంస్థ ప్రకటించింది.ఇంటర్వ్యూ లో అడిగే ప్రశ్నలు ఐటిఐ సబ్జెక్ట్ లో ఆధారంగా జరగనుంది.
దరఖాస్తు చివరితేది : 2021 జనవరి 17
పోస్టుల వివరాలు :
ఫిట్టర్,
Turner,
Machinist,
ఎలక్ట్రానిక్స్,
మెకానిక్స్,
R&AC,
ఎలక్ట్రీషియన్.
విద్యార్హత : ఐ టి ఐ
వేతనం :రూ.8050 రూపాయలను ఒక ఏడాది పాటు అప్రెంటిస్ ట్రైనింగ్లో స్టైఫండ్ గా ఇస్తారు.
నోటిఫికేషన్ లింక్ :apprenticeshipindia.org
ఇంటర్వ్యూ జరుగు స్థలం:
అడీ అంప్తిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల,
రామానాయుడు పేట, మచిలీపట్నం -521001.
ఈ ఉద్యోగానికి సంబంధించిన అన్ని విషయాలు apprenticeshipindia.org ద్వారా తెలియచేయబడ్డాయి. ఐటిఐ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు, ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ సూచిస్తోంది.
ఈ ఉద్యోగానికి రిజిస్టర్ చేసుకోవాలనుకునే వారు పైన ఇచ్చిన లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ముగిసిన తర్వాత ఫామ్ ను ప్రింట్ తీసుకోవాలి. ఫాం లో ఇంటర్వ్యూకు హాజరు అయ్యే సమయంలో తీసుకురావాలి.ఒకవేళ మీరు ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయితే ఒక సంవత్సరం పాటు అప్రెంటిస్ ట్రైనింగ్ ఆ పని చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎంప్లాయి గా ప్రమోట్ చేస్తారు.ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నారు BEL సంస్థ వారు.