
కాంట్రాక్ట్ విధానంలో పలు పోస్టుల భర్తీకై తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది ప్రభుత్వం. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఆసక్తికర అభ్యర్దులు అప్లై చేసేయండి. ఈ నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆసక్తి గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరు అయి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు.
* మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య 18 గా ఉంది.
* అప్లై చేసుకోవాలనే అభ్యర్థులకు దరఖాస్తుకు చివరి తేదిని 2022 మార్చి 19 గా గడువు ఇవ్వడం జరిగింది.
* విద్యార్హత: పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, బీఎస్సీ, ఎమ్మెస్సీ , పీజీ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
* అలాగే సంబంధిత పని విభాగంలో అనుభవం కలిగి ఉండాలి. మరియు ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండటం అవసరం.
* వయోపరిమితి: ఈ జాబ్ కు అప్లై చేసుకునే అభ్యర్దులు 42 ఏళ్ల వయస్సుకు మించరాదు.
*ఎంపిక విధానం: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు .
* వేతనం వివరాలు: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు కేడర్ ను బట్టి జీతం నెలకు రూ. 12000 నుంచి రూ.37100 వరకు వేతనం చెల్లిస్తారు.
పైన ఇచ్చిన ఉద్యోగ వివరాలకు సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా అనంతపురం GGH ను సందర్శించండి.