పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. దీపావళి తర్వాత కొద్ది రోజుల పాటు భారీగా దిగొచ్చిన బంగారం ధరలు ..ఇప్పుడు మాత్రం రోజు రోజుకు పైకి పెరుగుతూ వస్తుంది.. నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు ఇంకాస్త పెరిగింది.. షాకిచ్చే విధంగా ఈరోజు రేట్లు బాగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ధర మాత్రం కిందకు దిగి వచ్చినా కూడా భారతీయ మార్కెట్ లో మాత్రం ఒక్కసారిగా రేట్లు పైకి కదిలాయి. పసిడి ధర గత వారం రోజుల్లో పైపైకి చేరింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. వెండి రేటు కూడా భారీగా పెరిగింది.హైదరాబాద్ మార్కెట్‌లో వారం రోజుల్లో బంగారం ధర భారీగా పెరిగింది.



ఈరోజు రేట్ల విషయానికొస్తే..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.1100 పరుగులు పెట్టింది. రూ.51,060కు ఎగసింది. అదే విధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.1010 పెరుగుదలతో రూ.46,810కు చేరింది. ఒకేసారి వెయ్యికి పైగా పెరగడంతో పసిడి ప్రియులకు చేదు వార్త మిగిలింది. ప్రస్తుతం పెరిగిన రేట్ల వల్ల బంగారాన్ని కొనుగోలు చేసే వారికి బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. వెండి కూడా బంగారం ధరల పై ఆధారపడుతుంది.. గత కొన్ని రోజులుగా బంగారం కన్నా ఎక్కువగా వెండి ధరలు ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నాయి.



అయితే గోల్డ్ రేటు పైనే వెండి ధరల పై ఆధారపడింది... వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. గత వారం రోజుల్లో వెండి ధర ఏకంగా రూ.4,200 పెరిగింది. దీంతో వెండి ధర రూ.71,600కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ భారీగా పెరగడంతో ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు.. వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి. అందుకే ఈ రోజు రేటు భారీగా పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: