శుభకార్యం ఏదైనా బంగారం కొనుగోలు చేయడానికి మగువలు వెనక్కి తగ్గరు. అందులోనూ పండుగ వచ్చిందంటే కొనుగోళ్ల జోరు కొనసాగుతుంది. సంక్రాంతి నేపథ్యంలో నగరంలోని పలు జ్యువెల్లరీ దుకాణాలు వినియోగ దారులతో కళకళలాడాయి. అమీర్‌పేట్‌, అబిడ్స్‌, సికింద్రాబాద్‌, పంజా గుట్ట, దిల్‌సుఖ్ ‌నగర్‌ తదితర ప్రాంతాల్లోని పసిడి దుకాణాలు సందడిని తలపించాయి.. సంక్రాంతి పండుగకు చాలా మంది బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు.. అందుకే ఇప్పుడు ధరల పెరిగిన కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు..



మొన్నటి వరకు కొంతగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు రేట్లు పరుగులు పెడుతున్నాయి.. గోల్డ్ రేట్ల పైనే వెండి ధరలు ఆధారపడుతున్నాయని తెలిసిందే.వెండి ధర కూడా పైపైకి చేరింది. పండగలకు బంగారాన్ని కొనుగోలు చేసే వారికి ఈరోజు ధర నిరాశ కలిగిస్తుంది.. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,200 ఉండగా, 10 గ్రాముల 24క్యారెట్ల పసిడి ధర రూ.50,400కు చేరింది. మంగళవారం నుంచిి పెరిగింది.  నిన్నటి తో పోలిస్తే ఈరోజు భారీగా పైకి కదిలాయి  270 పెరిగింది.



ఇకపోతే బంగారం ధరలు పెరిగితే .. వెండి కూడా అదే దారిలో నడిచింది.వెండీ ధరలు కూడా పరుగులు తీస్తున్నాయి. వెండి రూ.600 పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.69,600కు చేరింది. పరిశ్రమ, యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ ఉండటంతో వెండి కొనుగోళ్లు ఊపందుకున్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఔన్స్‌కు 0.3 శాతం పెరుగుదలతో 1847 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.16 శాతం పెరుగుదలతో 25.4 డాలర్లకు పెరిగింది.. సంక్రాంతికి కూడా ధర బాగా పెరిగింది. రానున్న రోజుల్లో తగ్గుతుందేమో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: