పసిడి ప్రియులకు శుభవార్త.. ఈ రోజు ధరలు స్థిరంగా ఉన్నాయి. మొన్నటి తో పోలిస్తే ఈ రోజు ధరలు ఇలా ఉండటం ఊరట కలిగించే విషయం అనే చెప్పాలి.ధర పెరగకుండా నాలుగు రోజులుగా స్థిరంగానే ఉంటూ వస్తోంది. ఈరోజు కూడా ఎలాంటి మార్పు లేదు. బంగారం ధర స్థిరంగానే ఉంది. బంగారం ధర నిలకడగా ఉంటే.. వెండి ధరలు మాత్రం ఆకాశానికి నిచ్చెనలు వేసేలా ఉన్నాయి. ఈరోజు ధరలు భారీగా పెరిగాయి. అంతర్జతీయ మార్కెట్ లో ధరలు పడిపోయాయి.. 


ఇక హైదరాబాద్ మార్కెట్ లో ఈరోజు ధరలను గమనిస్తే..హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం బంగారం ధర స్థిరంగా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరలో ఈరోజు కూడా ఎలాంటి మార్పు లేదు. దీంతో రేటు రూ.48,290 వద్దనే కొనసాగుతోంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.44,250 వద్దనే స్థిరంగా ఉంది.బంగారం ధర స్థిరంగా కొనసాగితే.. వెండి రేటు మాత్రం పైకి కదిలింది. వెండి ధర రూ.400 పెరిగింది. దీంతో రేటు రూ.75,000కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా పరిగణలోకి తీసుకున్నారు. 


అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు చూస్తే..బంగారం ధర ఔన్స్‌కు 0.50 శాతం తగ్గుదలతో 1790 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.20 శాతం క్షీణతతో 27.27 డాలర్లకు దిగొచ్చింది. ఈ విధంగా బంగారం ధరలు పెరగడానికి, తగ్గడానికి చాలా కారణాలే ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే.. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారం ధరల పై ప్రభావం చూపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: