మగువలకు బంగారం అంటే ఎంత ఇష్టమో చెప్పాల్సిన పనిలేదు.. కానీ బంగారం ధరలు చూసి రాను రాను కొనాలంటే భయభ్రాంతులకు గుర అయ్యేలా అవుతున్నాయి. ధరలు కూడా భారీగా పెరగడంతో ఉండే బంగారాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఈమధ్య మహిళలు ఎక్కువగా బంగారం కంటే ఇల్లు పొలాలు స్థలాలు కొనడానికి మక్కువ చూపుతున్నారని గత కొద్దిరోజుల క్రితం కొన్ని నివేదికలు తెలియజేశాయి.


బంగారం ధరలు మొన్నటిదాకా లక్ష పది, లక్ష ఇరవై, లక్ష45 దాకా వెళ్ళిపోతుందని గోల్డెన్ స్నాక్స్ లాంటివారు ప్రకటించడంతో అందరూ కంగారుపడ్డారు.. అయితే ఇదంతా కూడా కేవలం కావాలని చేస్తున్న పరిస్థితులు అనే విధంగా కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు. 85 నుంచి 90 వేల రేంజ్ లో అయితే బంగారం ధర ఉంటుందట. అంతర్జాతీయ పరిణామాల వల్ల లక్షన్నర వరకు వెళ్లాల్సిన పనిలేదనే విధంగా తెలియజేస్తున్నారు. అయితే ఇప్పుడు ట్రంప్ ఆంక్షలు అన్నట్టుగా వంకలు పెట్టి పెంచారు.. ఇప్పుడు మళ్లీ తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు 98వేలు ,92 వేలు అన్నట్టుగా ఉన్నది.



అదే సందర్భంలో అక్షయ తృతీయ కారణంగా అలాగే గోల్డ్ ధరను కొంచెం పెంచుతూ వస్తున్నారు. అలాగే భారత్ , పాక్ యుద్ధం సాకు చూపెట్టి మరి మళ్ళీ బంగారం ధరలను పెంచుతారా అనేదే ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా? బంగారం కొనే సామాన్యులకు కలగా మిగిలిపోతుంది.. భారత్, పాకిస్తాన్ యుద్ధం చేయరు కానీ యుద్ధ వాతావరణం అయితే నెలకొన్నిపేలా చేస్తున్నారు. దీని కారణంగానే బంగారం ధర తగ్గడం లేదని నిపుణులు తెలియజేస్తున్నారు. నిజానికి బంగారం 85 వేల వద్ద ఆగిపోవాలి. అయితే బంగారం వ్యాపారాలు మాత్రం ఈ ఓవర్ ఫ్లోటింగ్ వల్లే ఇదంతా జరిగిందని అందుకే బంగారం ధరలు అంత రేటుకు పెరిగాయని తెలుపుతున్నారు.  ఇదంతా పక్కన పెడితే బంగారం ధరలు విషయంలో అయోమయంలో ప్రజలని పడేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: