మధుమేహం.. నేటి కాలంలో ఎంద‌రో ఈ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. డయాబెటిస్ లేదా షుగ‌ర్ లేదా మ‌ధుమేహిం.. ఇలా పేరు ఏదైనా స‌మ‌స్య ఒక్క‌టే. రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పరిమితికి మించి పెరిగిపోవడాన్నే మధుమేహంగా చెప్పవచ్చు. దీని వల్ల శరీర పనితీరు దెబ్బతింటుంది. ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. మ‌ధుమేహం విషయంలో ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా జీవితంలోని మాధుర్యాన్ని దూరం చేసి చేదుని మిగులుస్తుంది. మారుతున్న జీవన శైలి, కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, భోజనం, నిద్ర సమయాల్లో క్రమబద్ధత లోపించడం ఇలాంటివి మధుమేహానికి కారణాలుగా చెప్పుకోవ‌చ్చు. 

 

అయితే మ‌ధుమేహాన్ని త‌గ్గించుకోవ‌డానికి ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తుంటారు. కానీ, ఇంట్లో ఉన్న ఔష‌దాన్ని వ‌దిలేసి.. అదీ ఇదీ అంటూ తిరుగుతారు. అవును! మ‌ధుమేహాన్ని కంట్లో చేసే ఔష‌దం మ‌న ఇంట్లో ఉంది. అదే ధ‌నియాలు. సాంబారు, చారుల్లో సువాసన కోసం కొందరు, ఆరోగ్యం కోసం కొందరు ఉపయోగించే ఈ ధనియాలు మ‌ధుమేహానికి కంట్రోల్ చేయ‌డంలో ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ప్రతి రోజు ధనియాల కషాయాన్ని త్రాగితే మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది. ధనియాలులో ఉండే గుణాలు రక్తంలో చక్కర స్థాయిలు పెరగకుండా నియంత్రణలో ఉంచుతాయి. 

 

ప్రకృతిపరంగా లభించిన ధనియాలలో అనేక వైద్యపరమైన లక్షణాలు కలిగి ఉండటం వల్ల సహజ రూపంలో మన తీసుకోవడం వల్ల రక్తంలో చెక్కర స్థాయిలను తగ్గిచవచ్చని అనేక పరిశోధనులు, అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. అంతేకాకుండా ధ‌నియాల వ‌ల్ల మ‌రిన్ని ఉప‌యోగాలు ఉన్నాయి. ధనియాల కషాయం ఆకలిని పుట్టిస్తుంది. జ్వరం తర్వాత వచ్చే అరుచిని తగ్గించి నాలుకకు రుచిని తెప్పిస్తుంది. అలాగే ఈ క‌షాయం తాగ‌డం వ‌ల్ల‌ కొలెస్టరాల్‌ని నియంత్రణలో ఉంచుతుంది.  మ‌రియు ధనియాల కషాయం తాగితే నిద్రలేమి సమస్య నుంచి బయటపడవచ్చు. కాబ‌ట్టి.. మ‌ధుమేహంతో బాధ‌ప‌డేవారే కాకుండా.. అంద‌రూ ధ‌నియాల క‌షాయం తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: