ఏ చిన్న ఫంక్షన్ జరిగినా, విందు జరిగినా, భోజనం తరువాత తాంబూలం ఇవ్వడం ఆనవాయితీ.ఇక ఈ  ఆనవాయితీ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అవునండీ.. తాంబూలం తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఇప్పుడు తమలపాకులు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం

ముఖ్యంగా "భావప్రకాశ " అనే వైద్య గ్రంథంలో తాంబూలం సేవిస్తే శరీరానికి కలిగే ప్రయోజనాలతో పాటు దాని ప్రభావం గురించి వివరించారు.కానీ తమలపాకులను ఎక్కువగా తినడం వల్ల అది వికటించి అనారోగ్యాన్నీ కలగజేస్తోంది అని కూడా  ఆ గ్రంథంలో వివరించబడింది. తమలపాకులు తినడానికి వగరు, కారం రుచులను కలిగి ఉండి,శరీరానికి బాగా వేడి చేస్తాయి. కాబట్టి తమలపాకులను ఎక్కువగా తీసుకోకుండా ఉండటమే మంచిది. అంతేకాకుండా తమలపాకుకు సరగుణం ఎక్కువ. అంటే శరీరమంతటా త్వరగా వ్యాపించే గుణం తమలపాకుకు వుంది. కాబట్టి ఏదైనా మెడిసిన్ తీసుకున్నప్పుడు తమలపాకులు కూడా తినడం వల్ల,ఈ ఆకులు కేటలిస్ట్  లాగా పని చేసి, మనం తీసుకునే మెడిసిన్,పని చేయవలసిన ప్రాంతానికి  తొందరగా వెళుతుంది.

తాంబూలం తినడం వల్ల నోటి  రోగాలను పోగొడుతుంది. అంతేకాకుండా నోటి దుర్వాసనను పోగొట్టే,మౌత్ ఫ్రెష్నెష్ లా కూడా   ఉపయోగపడుతుంది. తమలపాకులు తినడం వల్ల అలసట, ఒత్తిడిని పోగొట్టి  ఉత్తేజాన్ని నింపుతుంది.  తమలపాకులను మితంగా తినడం వల్ల దంతాలు కూడా కాంతివంతంగా మారుతాయి. అంటే వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తాంబూలము నమలడం మంచిది.  అంతేకాకుండా తమలపాకుల నమలడం వల్ల దవడలు,పళ్ల మధ్య ఉండే పాచిని తొలగించి,నాలుకను శుభ్రం చేస్తాయి. అంతేకాకుండా గొంతు వ్యాధుల నుంచి బయటపడేలా చేయడానికి  ఎంతో సహాయపడతాయి.

ముఖ్యంగా తమలపాకు చివరి భాగాన ఆయుష్షు ఉంటుంది.  మొదటి భాగం అంటే తొడిమ దగ్గర కీర్తి. ఈనెల భాగంలో లక్ష్మీ,సంపద ఉంటాయి.కాబట్టి తొడిమలను, ఆకు చివరి భాగాన్ని, ఈనెలను తీసి తాంబూలం వేసుకోవాలి.  లేకపోతే ఆయుష్షు, కీర్తి, ఐశ్వర్యం నశిస్తాయి.ఈనెలను  తినడం వల్ల బుద్ధి కూడా నశిస్తుంది. తాంబూలం వేసుకున్నప్పుడు నమిలితే వచ్చే రసంలో మొదటిసారి  తోపాటు రెండవసారి వచ్చే రసాలు అనారోగ్యాన్నీ కలగజేస్తాయి కాబట్టి మొదటి రెండు సార్లు ఉమ్మివేయాలి. మూడోసారి బాగా నమలడం వల్ల వచ్చే రసాన్ని మింగడం వల్ల  శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

కాబట్టి పైన చదివిన విషయాన్ని గుర్తు పెట్టుకొని తాంబూలం ఎలా?ఏ విధంగా వాడితే ప్రయోజనం చేకూరుతుందో?తెలుసుకొని తాంబూలం సేవించడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: