మంత్రి మాట్లాడుతూ..చక్కెర స్థాయి నియంత్రణలో లేనివారు అంటే షుగర్ వ్యాధితో బాధపడేవారు, కిడ్నీ మార్పిడి వంటి శస్త్రచికిత్సల్లో భాగంగా రోగనిరోధక శక్తిని అణిచిపెట్టే మందులు వాడిన వారిలో ఈ వ్యాధి బయటపడుతోందట.కరోనా చికిత్సలో భాగంగా స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడుతున్న కొందరిలో దీన్ని గుర్తిస్తున్నారు.ఇతర ఆరోగ్య సమస్యలున్నవారిలో కూడా ఇది బయటపడుతుందని చెప్పారు.ఇక ఈ వ్యాధి లక్షణాలు విషయానికి వస్తే..కళ్లు, ముక్కు చుట్టూ నొప్పి, ఎర్రబారడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, రక్తవాంతులు, శ్వాసలో ఇబ్బందులు, మానసికంగా స్థిమితంగా ఉండలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్థాయని వెల్లడించారు.
అయితే కరోనా రోగులందరికీ ఇది రాదని, చికిత్సలో భాగంగా స్టిరాయిడ్లు తీసుకున్న వారందరూ బ్లాక్‌ఫంగస్ బారిన పడతారనేది వాస్తవం కాదని వైద్యులు చెబుతున్నారు.ఇటీవలి కాలంలో ఈ వ్యాధిని కొంత మంది కోవిడ్ రోగుల్లో గుర్తించామని చెప్పుకొచ్చారు. మొదట్లోనే రోగ నిర్ధారణతో ఈ వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్టవేయవచ్చని హర్ష వర్ధన్ సూచించారు. ఈ వ్యాధి అంతకు ముందు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రజలను ఎక్కువగా ప్రభావితం చేస్తుందని చెప్పిన మంత్రి.. ఇది పర్యావరణ వ్యాధికారకాలతో పోరాడే శక్తిని తగ్గిస్తుందన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి