ఉరుకుల పరుగుల జీవితం..  ప్రతి ఒకరికి భారీగా డబ్బులు సంపాదించాలనే ఆశ..  పర్యావరణ మొత్తం కాలుష్యంతో కమ్ముకు పోతున్న సమయంలో.. రోజురోజుకీ జనాలు ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా నేటి రోజుల్లో ప్రతి ఒక్కరిని వేధిస్తున్న సమస్య ఏది అంటే అది జుట్టు రాలే సమస్య అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ఇది సాధారణంగా అయితే చిన్న సమస్యే కానీ నేటి రోజుల్లో అన్ని వయసుల వారికి ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది.  ఈ క్రమంలోనే రాలిపోతున్న జుట్టును కాపాడుకోవడానికి ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.



 చివరికి ప్రయత్నాలు చేసి చేసి అలసిపోయి ఇక జుట్టు మీద ఆశలు వదిలేసుకున్నారు చాలామంది. అయితే  నేడు మానవుల జీవన శైలిలో రోజురోజుకు ఒత్తిడి పెరిగి పోతూ ఉండటం.. అంతే కాకుండా పర్యావరణం మొత్తం కాలుష్యంతో నిండిపోవడం.. అదే సమయంలో అనేక అనారోగ్య పూరితమైన ఆహారపు అలవాట్లు ఇలా ఎన్నో కారణాల వల్ల ఎంతోమంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. ఇక ఒక్కసారి జుట్టురాలడాన్ని గమనించారు అంటే చాలు ఇక ఈ సమస్యకు చెక్ పెట్టడానికి ఎంతో మంది వైద్యుల దగ్గరికి కూడా చక్కర్లు కొడుతూ ఉంటారు చాలామంది.


 ఎన్ని ప్రయత్నాలు చేసినా జుట్టురాలే సమస్యకు మాత్రం పరిష్కారం దొరకక ఇబ్బంది పడుతూ ఉంటారు అయితే దాదాపుగా రాలిపోయిన జుట్టును ఆపడం చాలా కష్టం కానీ కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం జుట్టు ఎక్కువ రాలకుండా  అరికట్టే అవకాశం ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి.. ద్వారా జుట్టు ఎంతో దృఢంగా మారుతుంది.  అంతేకాదు కంటినిండా నిద్రపోవటం.. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం లాంటివి చేయాలి. మద్యపానం ధూమపానం లాంటి వాటికి దూరంగా ఉండాలి. ఇక బయటికి వెళ్ళినప్పుడు వెంట్రుకలపై దుమ్ము ధూళి పడకుండా స్కార్ఫ్ లేదా క్యాప్ పెట్టుకోవడం లాంటి చేయాలి. ప్రతిరోజు కాకుండా రెండు మూడు రోజులకు ఒకసారి మాత్రమే షాంపూ చేయాలి దువ్వెనతో తలని బలంగా దువ్వ కూడదు.. అంతేకాకుండా హెయిర్ డ్రయ్యర్ వాడకూడదు ఇలా చేయడం వల్ల జుట్టు రాలే సమస్యను అరికట్టవచ్చు అని చెబుతున్నారు నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: